Anaya Bangar : భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్.. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని అనయ బంగర్ గా మారిపోయానని పేర్కొన్నారు. తాను పూర్తిగా మహిళగా మారిపోయినట్లు ధృవీకరించే మెడికల్ సర్టిఫికెట్‌ను చూపిస్తూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. సర్టిఫికెట్ ప్రకారం.. ప్రస్తుతం వుమెన్స్ క్రికెట్ ఆడేందుకు తనకు అన్ని రకాల అర్హత ఉన్నాయంటూ వీడియోలో పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టుకు మాజీ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సైతం క్రికెట్లో ప్లేయర్‌గా ముంబై జూనియర్ జట్టు తరఫున ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లతో కలిసి ఆడాడు. ప్రస్తుతం తన అస్తిత్వాన్ని మహిళగా మార్చుకున్న అతను పేరును అనయ బంగర్‌గా మార్చుకుని ఆమెగా రూపాంతరం చెందాడు. ట్రాన్స్ జెండర్ విషయంలో మహిళల క్రికెట్లో పలు ఆంక్షలున్నాయి. దీని వల్ల అతను గత సంవత్సరం నుంచి పూర్తి మహిళగా మారేందుకు హార్మోన్ థెరపీ మొదలుపెట్టాడు. ట్రాన్స్ వుమెన్ గా మారిన అనయ బంగర్.. మహిళల సామర్థ్యాలు మాత్రమే తనకు ఉండేలా శస్త్రచికిత్సలు చేయించుకుని సర్టిఫికెట్ పొందారు. ICC గత సంవత్సరం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. లింగ మార్పిడి చేసుకున్నవారు.. అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనడానికి వీలులేదు. ఈ నేపథ్యంలో అనయ బంగర్ తాను పూర్తి మహిళ సామర్థ్యాలను మాత్రమే కలిగి ఉన్నానంటూ వైద్య రిపోర్టుతో కూడిన వీడియోను విడుదల చేసింది.
తను సమర్పించిన రిపోర్టు శాస్త్రీయ ఆధారాల ఆధారంగా ఇచ్చిన నివేదిక అని ఆమె స్పష్టం చేశారు. ఈ నివేదికను బీసీసీఐకి, ఐసీసీకి సమర్పించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థను ఇబ్బంది పెట్టడానికి తాను ఈ నివేదిక చూపించట్లేదని.. సైంటిఫిక్ అంశాల ప్రకారం..తాను మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హురాలినని చెప్పేందుకేనని తెలిపింది. తాను వెల్లడించిన ఈ సత్యాన్ని ప్రపంచం అంగీకరించగలదా అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఏదేమైనా.. క్రికెట్‌పై ఆమెకున్న మక్కువను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.