India vs England 1st Test : Ben Stokes ఎందుకిలా చేశాడు..? యువ టీమిండియా షాక్ ఇస్తుందా..?  

India vs England 1st Test : టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్ట్ లీడ్స్‌లోని హెడ్డింగ్‌లీ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ( Ben Stokes ) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవడం ఆ జట్టుకు అనుకున్నంత ప్లస్ కాలేదు. మొదటి రోజు టాస్ గెలిచి స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యకరంగా అనిపించిందని కూడా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. యువ భారత జట్టు తొలి రోజు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని తొలి టెస్ట్‌పై పట్టు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సరికి కేవలం 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేయగా.. రెండో రోజు 471 పరుగులకు ఆలౌటయ్యింది. ఇంగ్లాండ్ బౌలింగ్ లైనప్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, ఆదిల్ రషీద్ లాంటి అనుభవశీలురైన బౌలర్లు లేకపోవడం ఆ జట్టుకు మైనస్ అయినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.

Ben Stokes బౌలింగ్ ఎంచుకున్నాడని షాకయ్యా

హెడ్డింగ్‌లీలో గత ఆరు టెస్టుల్లో టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకుని గెలుపొందాయి. ఈ కారణాంగానే Ben Stokes ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అర్థమవుతుంది. అయితే ఈ విషయమై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం స్టోక్స్ తప్పు నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డారు. హెడ్డింగ్‌లీలో సన్ లైట్ బాగున్నప్పుడు టాస్ గెలిస్తే సాధారణంగా బ్యాటింగ్ ఎంచుకోవడం చేస్తామని.. అలాంటిది క్లియర్ సన్ లైట్ ఉన్నప్పుడు టాస్ గెలిచి స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడని తెలిసి షాకయ్యానని వాన్ పేర్కొన్నాడు.

image Credit : X

స్టోక్స్ మాత్రం క్లియర్‌గా..

ఈ మ్యాచ్ సందర్భంగా Ben Stokes టాస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ.. మ్యాచ్ ఇనిషియల్ సిచువేషన్స్ ఉపయోగించుకోవాలని చూస్తున్నామన్నాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ సైతం.. పిచ్‌పై ఎంతో కొంత తేమ ఉందని భావించి అది న్యూ బాల్ స్వింగ్‌కు పనికొస్తుందని టాస్ ఎంచుకోవడం బెటర్ అనుకున్నట్లు చెప్పాడు. అయితే అనూహ్యంగా భారత యువ టీం అంచనాలకు విరుద్ధంగా ఇంగ్లాండ్ పేస్ దళాన్ని చాలా సమర్థంగా ఎదుర్కొంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీలతో చెలరేగారు.

image credit : X

కండీషన్లను చూసుకోవాలి కదా..

అయితే ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఈ స్టేడియంలో ఫోర్త్ ఇన్నింగ్స్‌లో చాలా సార్లు విజయాలు సాధించింది. 2019, 2023లో ఆస్ట్రేలియాపై, 2022లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయాలు ఫోర్త్ ఇన్నింగ్స్‌లో సాధించింది. ఫలితంగా ఇంగ్లాండ్ ఛేజ్ తమకు కలిసొస్తుందనే అంశాన్ని సైతం కీలకంగా పరిగణించి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్లు కూడా స్పష్టమవుతుంది. ఈ మ్యాచ్ విషయంలో మాత్రం ఇంగ్లాండ్ అంచనాలు తప్పన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం. గత విజయాలను పరిగణించి.. ఈ రోజు ఉన్న కండీషన్లను పట్టించుకోకపోవడం సరికాదన్నట్లు వాన్ పేర్కొన్నాడు.

బౌలింగ్లో అనుభవలేమి వల్లే..

ఇకపోతే ఇంగ్లాండ్ టీం పేస్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ మాత్రం Ben Stokes నిర్ణయాన్ని సమర్థించడమే కాకుండా.. భారత ఓపెనర్లు పిచ్ కండీషన్లను సరిగా అంచనా వేసి ఆడారని ప్రశంసించాడు. పిచ్‌లో తొలుత తేమ ఉందనిపించిందని.. ఓవర్లు జరుగుతున్న కొద్దీ మ్యాచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయిందన్నట్లు అతను పేర్కొన్నాడు. ఇకపోతే ఆ జట్టులో స్టోక్స్ బౌలింగ్లో ప్రభావం చూపగా.. జైడన్ కార్స్, జోష్ టంగ్ కేవలం 10 టెస్టుల అనుభవమున్న ప్లేయర్లు. అందువల్ల వాళ్లు మ్యాచ్ ప్రారంభంలో ప్రభావం చూపగలిగే స్పెల్ వేయలేదు. ఫలితం ఇండియా పుంజుకునడానికి వీలుపడింది.

India vs England 1st Test : పటిష్ట స్థితిలో ఇండియా

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు కొంత నిలకడతో ఆడి మంచి భాగస్వామ్యాలను నిర్మించడంతో తొలి ఇన్నింగ్సులో ఇండియా 471 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101పరుగులు) చేయగా..,కేఎల్ రాహుల్(78 బంతుల్లో 8 ఫోర్లతో 42పరుగులు) మంచి శుభారంభాన్నిచ్చాడు. భారీ అంచనాలతో తొలి టెస్టులో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147 పరుగులు) చేశాడు. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134 పరుగులు) చేసి భారీస్కోరుకు బాటలు వేశాడు. పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ డకౌట్ కాగా.. నితీష్ కుమార్‌ను కాదని అనుభవం కారణంగా టీంలోకి తీసుకున్న శార్దూల్ ఠాకూర్ 1 పరుగు నిరాశపరిచాడు. రవీంద్ర జడేజా 11, బుమ్రా 0, ప్రసిద్ద్ 1, సిరాజ్ 3 నాటౌట్ టెయిలెండర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో Ben Stokes, జోష్ టంగ్ తలా 4 వికెట్లు తీయగా.. జైడన్ కార్స్, బషీర్ తలా ఓ వికెట్ తీశారు.

India vs England 1st Test Playing 11 :

ఇండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

Also Read : త్వరలో 4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లు.. ఆ కారణం వల్లే..!

image credit : X

పటౌడీ ట్రోఫీ కాస్తా ఆండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీగా

ఇకపోతే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక అయిదు టెస్టుల సిరీస్ ట్రోఫీకి దిగ్గజ క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, జేమ్స్ ఆండర్సన్‌ల పేర్లను పెట్టారు. ఇప్పటివరకు పటౌడీ ట్రోఫీగా పిలవబడుతున్న ఈ సిరీస్‌ను ఇకపై ‘ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’గా మార్చారు. ఈసీబీ, బీసీసీఐ ఇటీవలే సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మీదట ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య అటు ఇంగ్లాండ్‌లోనూ ఇండియాలోనూ జరిగే టెస్టు సిరీస్లను ఆండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీగా పేర్కొంటారు.

Leave a Comment