Jasprit Bumrah About Captaincy : బీసీసీఐ ఆఫర్ చేసింది కానీ..? 

Jasprit Bumrah About Captaincy : టీమిండియా టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా తనకు బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో తనకున్న అనుబంధంపై బుమ్రా స్పందించాడు. జట్టు మార్పు దశలో ఉందని దాని నుంచి బయటపడి మళ్లీ పుంజుకునేందుకు అవసరమైన సలహాలు కెప్టెన్‌కు ఇచ్చేందుకు తాను సిద్ధమని జస్ప్రీత్ బుమ్రా ప్రకటించాడు. 

‘నాకు గిల్‌తో మంచి అనుబంధం ఉంది. కెప్టెన్‌కి ఏదైనా అవసరమైతే సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. అయితే కెప్టెన్లకు వారి సొంత నిర్ణయం తీసుకునే సత్తా ఉండాలి. ఓ సీనియర్‌గా నేను అతనికి ఆ అవకాశాన్ని ఇవ్వాలి.  అతన్ని ఎక్కువగా డామినేట్ చేయకుండా ఉండాలి.  ఎక్కువ స్వేచ్చ ఇచ్చినపుడు వారికి అనుభవం వస్తుంది’ అని బుమ్రా పేర్కొన్నాడు. 

గంభీర్ విడివిడిగా మాట్లాడతాడు

రాబోయే ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టు గతంతో పోలిస్తే భిన్నంగా ఉందని, ఇలాంటి సమయంలో కోచింగ్ సిబ్బంది ఓపికగా, శాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని బుమ్రా అభిప్రాయపడ్డాడు.  ‘హెడ్ కోచ్ గంభీర్ కోచింగ్ స్టైల్ డిఫరెంట్‌ గా ఉంటుంది. ఒక్కో ఆటగాడితో విడిగా మాట్లాడతారు.  జట్టు మొత్తం ముందుకు పోతున్న దశలో.. ఆయనకి కొన్ని ఆలోచనలు ఉంటే స్వయంగా వచ్చి చెబుతారు. ప్రస్తుతం రోహిత్, విరాట్ లేకుండా జట్టు మార్పు దశలో కోచ్‌గా గౌతమ్ గంభీర్ సూచనలు, సలహాలు యువ ప్లేయర్లకు ఎంతో ఉపయోగపడతాయని నమ్ముతున్నాను’ అని బుమ్రా పేర్కొన్నాడు.


Leave a Comment