VVS Laxman: రెండు రోజులుగా వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుతో కనిపిస్తున్నాడు. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ఇంగ్లాండ్‌లో అతడి పాత్ర గురించి ఇంకా ఏం చెప్పడం లేదు. కోచ్ గౌతమ్ గంభీర్ ఈ మధ్యే తన తల్లికి గుండెపోటు రావడంతో ఇండియాకు వచ్చేశాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో నిపుణుడిగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో అధికారికంగా సంబంధం ఉన్న వ్యక్తిగా, లక్ష్మణ్ భారత క్రికెట్‌లో ప్రస్తుతం కీలక రోల్ పోషిస్తున్నాడు. కాగా గౌతమ్ గంభీర్ ప్లేస్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టుల్లో టీమిండియా కోచ్‌గా వ్యవహిరిస్తాడని చర్చ జరుగుతోంది.
గంభీర్ వచ్చే ఛాన్స్
లక్ష్మణ్ ఇంగ్లాండ్‌లో మొత్తం 34 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2002, 2007 2011 మూడు పర్యటనలలో 11 టెస్ట్ మ్యాచులు ఇంగ్లాండ్ లో ఆడాడు. 2007, 2009 కౌంటీ ఎడిషన్‌లలో లాంక్ షైర్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ కు వీవీఎస్ వేరే పని మీద వెళ్లినప్పటికీ అతడు లార్డ్స్‌లో టీంతో రెండు రోజులుగా ఉంటున్నాడు. అయితే గౌతమ్ గంభీర్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభ సమయానికి తిరిగి వచ్చేస్తాడని అనుకుంటున్నారు. దీంతో లక్ష్మణ్ పాత్ర పెద్దగా ఏమీ ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ తల్లి ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లు తెలుస్తోంది. దీంతో అతను తిరిగి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. జూన్ 20 నుండి లీడ్స్‌లో మొదటి టెస్ట్ జరగనుంది.