India vs England 1st Test : TeamIndia ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్ట్ లీడ్స్‌లోని హెడ్డింగ్‌లీ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో యువ టీమిండియా అనుకున్నదొక్కటి.. అవుతుందొక్కటి. తొలి రోజు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు చేసిన టీమిండియా.. రెండో రోజు 471 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 41 పరుగులకే 7 వికెట్లు పోగొట్టుకోవడంతో ఈజీగా 500 నుంచి 550 పరుగుల భారీ స్కోరు సాధించే వీలును కోల్పోయింది.
బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ Bumrah తప్పా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఇంగ్లాండ్‌ను 400 లోపు కట్టడి చేసే అవకాశాన్ని కూడా TeamIndia చేజార్చుకుంది. ఫలితంగా రెండో ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ ఏకంగా 465 పరుగులు చేసింది. కేవలం 6 పరుగుల లీడ్ మాత్రమే ఇండియాకు దక్కింది. టెస్టుల్లో ఛేదనలో బలమైన జట్టైన ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే ఇప్పుడున్న సిచువేషన్లో అతి కష్టమేనని చెప్పాలి.

image credit : X
TeamIndia జిడ్డూ ఫీల్డింగ్
మూడో రోజు TeamIndia ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లు నేలపాలు చేశాడు. స్లిప్స్, గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో విడిచిన ఈ మూడు క్యాచ్‌లు ఇంగ్లాండ్‌కు బాగా కలిసొచ్చాయి. Bumrah బౌలింగ్‌లో ఈ మూడు క్యాచ్‌లను వదిలేయడం గమనార్హం. అంతకుముందు రవీంద్ర జడేజా కూడా బుమ్రా బౌలింగ్‌లో ఒక క్యాచ్ వదిలేశాడు. దీంతో బుమ్రా బౌలింగ్‌లో మొత్తం నాలుగు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అయినా Bumrah తన శాయశక్తుల మేర రాణించి 5 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరుకు పరిమితమైంది.
క్యాచ్‌ల డ్రాప్ వల్ల TeamIndiaకు ఎంత నష్టం..?
ఓలీ పోప్ 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను ఇచ్చిన క్యాచ్ డ్రాప్ కావడంతో 106 పరుగులు చేశాడు. అంటే 44 పరుగుల మూల్యం. డకెట్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతని క్యాచ్ మిస్ చేయడంతో 62 పరుగుల వరకు క్రీజులో పాతుకుపోయాడు. అంటే 47 పరుగుల అదనం. బ్రూక్ 0 వద్ద ఔటయినప్పటికీ నోబాల్ కావడంతో అతనికి జీవనదానం వచ్చింది.. అదే కాకుండా 46, 82 వద్ద అతనికి లక్ ఫేవర్ చేసింది. 46 పరుగుల వద్ద అతని క్యాచ్ పట్టుంటే.. అతను 99 పరుగులు చేసేవాడే కాదు. ఫలితంగా 53 పరుగుల మూల్యం.
డ్రాప్‌ల వల్ల భారీ మూల్యం
క్యాచ్ డ్రాప్‌ల వల్ల మొత్తంగా 144 పరుగుల మూల్యాన్ని TeamIndia చెల్లించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా 150 పరుగుల లీడ్ దక్కాల్సింది కేవలం 6 పరుగుల లీడ్ మాత్రమే దక్కింది. ఇది భారత్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డ్రాప్‌ల వల్ల జరిగిన మూల్యాన్ని తగ్గించాలంటే.. ఇండియా రెండో ఇన్నింగ్స్ పూర్తి కంట్రోల్‌తో ఆడి భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది.

image credit : X
ఆ టైంలో హిట్టింగ్ అవసరమా..
టెస్టుల్లో ముఖ్యంగా తొలి ఇన్నింగ్సులో భారీ స్కోరు సాధించే అవకాశమున్నప్పుడు అనవసర హిట్టింగ్ అవసరం లేదు. కానీ ఈ విషయంలో TeamIndia 400 పరుగులు దాటిన తర్వాత కాస్త అత్యుత్సాహానికి లోనయ్యింది. 430 పరుగుల వరకు 3 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న ఇండియా కేవలం 41 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయింది.
సెంచరీలు చాలా.. ఆ తర్వాత దూకుడా
సాధారణంగా టెస్టుల్లో నిలదొక్కుకున్న బ్యాటర్లే తమ సెంచరీలను డబుల్ సెంచరీలుగా మార్చుతూ ఇన్నింగ్స్ నడిపిస్తుంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్సులో స్కోరు వేగం పెంచడానికి నిలదొక్కుకున్న బ్యాటర్లు వికెట్ చేజార్చుకోరాదు. కానీ ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకున్న పంత్, శుభ్‌మన్ గిల్ స్కోరు వేగం పెంచేందుకు పూనుకుని ఔటయ్యారు. ఫలితంగా వారు తమ సెంచరీలను డబుల్ సెంచరీలుగా మలుచుకోలేకపోవడమే కాకుండా.. టీంను కాస్త రిస్క్‌లో పెట్టినట్లేనని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారిద్దరు కెప్టెన్, వైస్ కెప్టెన్లు.
కుదురుకున్నవాళ్లే ఆడగలరు
వారు ఔటయ్యాక Teamindia లోయర్ ఆర్డర్ పేకమేడలా కూలింది. టెస్ట్ అన్నాక ఇంతే.. కుదురుకునే లోపే ఔటవుతుంటారు. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. స్కోరు కన్నా కుదురుకున్న ప్లేయర్లు ఇన్నింగ్స్ నిర్మించడం భాగస్వామ్యాలు నెలకొల్పడం చేయాలి.. నూతన బ్యాటర్ కుదురుకునేవరకు పరిస్థితిని బట్టి ఆడాలి. కానీ 400 దాటేసరికి మన ప్లేయర్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో హిట్ చేసి ఈజీగా 500 కి మించి పరుగులు రాబట్టే వీలున్న తొలి ఇన్నింగ్స్‌ను 471కి సరిపెట్టి విజయవకాశాలను నీరుగార్చారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండో ఇన్నింగ్సులో 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఫలితంగా 96 పరుగుల ఆధిక్యంలో Teamindia ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (45 నాటౌట్ 7ఫోర్లు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్ 1 ఫోర్ ) ఉన్నారు. యశస్వి జైశ్వాల్ కేవలం (4పరుగులు) త్వరగానే ఔటవ్వగా.. సాయి సుదర్శన్ (30పరుగులు 48బంతుల్లో) స్టోక్స్ ప్లాన్ ప్రకారం వేసిన డెలివరీకి దొరికిపోయాడు. తనకు బెన్ డకెట్ క్యాచ్ డ్రాప్ ద్వారా ఓ జీవన దానం లభించినా.. అతను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

image credit : X
Bumrah లేకపోతే బౌలింగ్ డొల్లేనా..?
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్సులో 465 పరుగులు చేయగలిగిందంటే TeamIndia బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కచ్చితంగా కారణమనే చెప్పాలి. Bumrah ఒక్కడే (24.4 ఓవర్లలో 5 వికెట్లు, 83 పరుగులు) ప్రభావం చూపినా.. ప్రసిద్ధ్ (20 ఓవర్లలో 3వికెట్లు 128 పరుగులు), సిరాజ్ (27 ఓవర్లలో 2వికెట్లు 122 పరుగులు) ధారాళంగా పరుగులిస్తూ వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. ఇక శార్దూల్ ఠాకూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతనికి కేవలం 6 ఓవర్లు మాత్రమే గిల్ బౌలింగ్ ఇచ్చాడు. మరి అతనికేమైందో తెలీదు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓలీ పోప్ (106) సెంచరీతో చెలరేగగా.. డకెట్ (62), హ్యారీ బ్రూక్ (99), క్రిస్ వోక్స్ (38), జేమీ స్మిత్ (40) రాణించారు.
ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్సులో భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101 పరుగులు) చేయగా..,కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 8 ఫోర్లతో 42పరుగులు) మంచి శుభారంభాన్నిచ్చాడు. భారీ అంచనాలతో తొలి టెస్టులో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ (227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147 పరుగులు) చేశాడు. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134 పరుగులు) చేశాడు. మిగితావాళ్లు నిరాశపరిచారు.
Also Read : India vs England 1st Test : Ben Stokes ఎందుకిలా చేశాడు..? యువ టీమిండియా షాక్ ఇస్తుందా..?
Also Read : Jasprit Bumrah About Captaincy : బీసీసీఐ ఆఫర్ చేసింది కానీ..?
India vs England 1st Test Playing 11 :
ఇండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్