India vs England 1st Test : ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లీ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో Teamindia చేసిన పొరపాట్లు ఇంగ్లాండ్ గెలిచేట్లు చేశాయి. టీమిండియా బ్యాటింగ్లో హరీబరీ కావడం.. బౌలింగ్లో బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడడం, ఫీల్డింగులో లడ్డూలాంటి క్యాచులను మిస్ చేయడం లాంటి పొరపాట్లు చేసి.. ఇంగ్లాండ్‌కు విజయాన్ని అప్పనంగా కట్టబెట్టింది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్ వరకు ఇండియాదే ఆధిపత్యం.. గెలుపునకు అన్నీ అవకాశాలున్నాయి.. గెలవకున్నా డ్రా అన్న పక్కా అయ్యేది.. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఓడిపోవడానికి ఇండియా చేసిన కాస్ట్ లీ మిస్టేక్స్ కారణం.
ఆ సెషన్లో మెరుగ్గా ఆడాల్సింది..
నాలుగో రోజు.. రెండు సెషన్ల పాటు పూర్తి ఆధిపత్యం వహించిన Teamindia.. మూడో సెషన్లో ఉన్నపళంగా 31 పరుగుల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లు కోల్పోయి 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకానొక దశలో 332 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ఠ స్థితిలో ఉన్న Teamindia ఈజీగా 400 దాటేస్తుందనుకుంటే 364కే కుప్పకూలింది. దీంతో 371 పరుగుల లీడ్ మాత్రమే దక్కింది. ఆ సెషన్లో ఇంకాస్త మెరుగ్గా ఆడుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఫలితంగా ఇంగ్లాండ్ లాంటి జట్టుకు అది సొంత మైదానంలో ఈ స్కోరు ఛేదించడం చాలా ఈజీగా మారింది.
Teamindia హరీబరీ బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో తొలి రోజు Teamindia బ్యాటర్లు ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశారు. యువ టీమిండియా తక్కువేం కాదని నిరూపించేలా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు చేసింది. అయితే రెండో రోజు స్కోరు వేగం పెంచడం కోసం హరీబరీ బ్యాటింగ్ మొదలెట్టారు. దీంతో 41 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు పోగొట్టుకుని 471 పరుగులకే టీమిండియా పరిమితమైంది. ఈజీగా స్కోరు 500 ప్లస్ అవుతుందనుకుంటే.. పరిస్థితి వేరే అయింది. సేమ్ అలాగే రెండో ఇన్నింగ్సులోనూ కుప్పకూలింది. దీంతో మ్యాచ్‌ను ఇంగ్లాండ్ తన చేతుల్లోకి తీసుకుంది.
ఇంగ్లాండ్ స్ట్రాటెజీ తెలిసి కూడా..
ఇంగ్లాండ్ ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఛేదనకు పెట్టింది పేరు. ఈ స్టేడియంలో ఫోర్త్ ఇన్నింగ్స్‌లో చాలా సార్లు ఆ జట్టు విజయాలు సాధించింది. 2019, 2023లో ఆస్ట్రేలియాపై, 2022లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయాలు సాధించింది. ఆ జట్టు స్ట్రాటెజీ ప్రకారం రెండో బ్యాటింగ్ ఎంచుకుని.. తమ కండీషన్లను బాగా యుటిలైజ్ చేసుకుంటుంది. ఇంగ్లాండ్ స్ట్రాటెజీ తెలిసి కూడా దానికి తగ్గట్లు ఆడడంలో ఇండియా విఫలమైంది.

image credit : X
ఆ క్యాచ్‌లు గనుక పట్టుంటే..
మూడో రోజు TeamIndia ఫీల్డింగ్‌లో చేసిన కొన్ని మిస్టేక్స్ కాస్ట్‌లీగా మారాయి.. యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లు, జడేజా ఒక క్యాచ్ నేలపాలు చేశారు. ఆ క్యాచ్ డ్రాప్‌ల ఫలితంగా ఓలీపోప్, డకెట్, హ్యారీ బ్రూక్ చెలరేగారు. క్యాచ్ డ్రాప్‌ల అనంతరం వీరు ముగ్గురు కలిపి చేసిన పరుగులు 144 పరుగులు. ఈ క్యాచ్‌లు గనుక పట్టుంటే ఇండియాకు 500 కి మించి లీడ్ దొరికేది. అలాగే.. అయిదో రోజు బెన్ డకెట్ 97 పరుగుల వద్ద యశస్వి మరో క్యాచ్ మిస్ చేయడంతో అతను 149 పరుగులు చేసి మ్యాచ్ ఫలితాన్ని ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు.

ప్రభావవంతంగా బుమ్రా ఒక్కడే
ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్సులో భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101 పరుగులు) చేయగా..,కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147 పరుగులు) చేశాడు. వైస్ కెప్టెన్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134 పరుగులు) రాణించారు. దీంతో 471 పరుగుల స్కోరు నమోదైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ దీటుగా ఆడి 465 పరుగులు చేసింది. బుమ్రా ఒక్కడే (24.4 ఓవర్లలో 5 వికెట్లు, 83 పరుగులు) ప్రభావం చూపాడు.
ఇద్దరు సెంచరీ చేసినా..
Teamindia రెండో ఇన్నింగ్సులో కేఎల్ రాహుల్ (137 పరుగులు 247 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీతో నిలకడ చూపించగా.. రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్సులోనూ (118 పరుగులు 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరు చూపించినంత సేపు చూపించి లూజ్ షాట్‌కు అవుటయ్యాడు. వీరిద్దరూ ఔటయ్యాక మిగతా ప్లేయర్లు అలా వచ్చి ఇలా వెళ్లడంతో 364 పరుగులకే పరిమితమైంది. ఇక 371 పరుగుల లీడ్ అందుకున్న ఇంగ్లాండ్ చాలా పకడ్బందీగా ఆడింది.

image credit : X
వారిద్దరూ మ్యాచ్ లాగేసుకున్నారు.
అయిదో రోజు ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (65 పరుగులు), బెన్ డకెట్ (149 పరుగులు) చాలా క్రమశిక్షణతో ఆడుతూ ఇండియన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. వీరిద్దరు తొలి వికెట్‌కు 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి.. ఇంగ్లాండ్ గెలుపుకు కీలక పునాది వేశారు. తర్వాత ఓలీపోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైన.. ఇంగ్లాండ్ క్లాస్ మాస్టర్ జో రూట్ (53 పరుగులు నాటౌట్ ) కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. బెన్ స్టోక్స్ (33 పరుగులు), జేమీ స్మిత్ (44 పరుగులు నాటౌట్) చివర్లో జో రూట్‌తో కలిసి ఇంపార్టెంట్ భాగస్వామ్యాలు నమోదు చేశారు.
కాసేపు రసవత్తరంగా సాగినా..
ఇక బౌలింగ్లో ప్రసిద్ధ్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనూహ్యంగా శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి అప్పటివరకు ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌ను కాస్త రసవత్తరంగా మార్చగలిగాడు. శార్దూల్ ఠాకూర్‌ను ఈ మ్యాచ్‌లో ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు. ఇకపోతే జడేజా స్టోక్స్ వికెట్ తీసి కాస్త ఆశలు రేకెత్తించినా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు రూట్, స్మిత్ పట్టువదలకుండా పోరాడడంతో ఆ జట్టు గెలుపొందింది.
India vs England 1st Test Playing 11 :
ఇండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
Also Read : India vs England 1st Test : టీమిండియా.. ఎందుకీ హరీబరీ..? ఇక బుమ్రాపైనే భారం