Steve Smith ఎంత పనిచేస్తివి.. ఆ క్యాచ్ వల్లే..!

Steve Smith: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ మ్యాచులో స్టీవ్ స్మిత్ జారవిడిచిన క్యాచ్ విలువ ఒక ఛాంపియన్ షిప్ టైటిల్ అని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 1999 సూపర్ సిక్సు మ్యాచులో స్టీవ్ వా ఇచ్చిన ఈజీ క్యాచును సౌతాఫ్రికా ఫీల్డర్ హెర్షల్ గిబ్స్ పట్టినట్లే పట్టి జారవిడుస్తాడు. ఆ సమయంలో నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేశావు.. దాని విలువ నీకు మున్ముందు తెలుస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా అంటాడు. ఆ వరల్డ్ కప్ లో అదే జరుగుతుంది. సెమీఫైనల్ లో సౌతాఫ్రికా తో మ్యాచులో 213 పరుగులతో మ్యాచ్ టై కాగా సూపర్ సిక్సులో గెలిచిన ఆసీస్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.

అప్పుడు గిబ్స్.. ఇప్పుడు Steve Smith

క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అని ఎందుకంటారో ఇప్పుడు ఆస్ట్రేలియన్లకు సరిగా అర్థమవుతుంది. 26 ఏళ్ల క్రితం గిబ్స్ చేసిన పొరపాటే స్మిత్ చేశాడు. రెండు వికెట్లు పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఇచ్చిన ఈజీ క్యాచ్ ను స్లిప్ లో స్టీవ్ స్మిత్ నేలపాలు చేశాడు. చక్కగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్ మంచి గుడ్ లెంగ్త్ బాల్ కు బవుమా క్యాచ్ ఇచ్చాడు. కానీ దాన్ని నేల పాలు చేసినా స్మిత్ గాయంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. కానీ అప్పటికీ టెంబ బవుమా రెండు పరుగులే చేశాడు. ఆ తర్వాత ఏ మాత్రం చాన్స్ ఇవ్వని బవుమా 65 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంతో కీలక పాత్ర పోషించాడు.

Leave a Comment