Teamindia Huge Mistakes : కొంపముంచిన కాస్ట్‌లీ పొరపాట్లు

India vs England 1st Test : ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లీ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో Teamindia గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఇంగ్లాండ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా అనేక పొరపాట్లు చేసింది. ఇవీ చాలా కాస్ట్‌లీ‌గా మారాయి. ఈ పొరపాట్లను ఇంగ్లాండ్ చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంది. అసలు టీమిండియా కొంపముంచిన పొరపాట్లు ఏంటో ఓసారి పరిశీలిస్తే..

బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్ వైఫల్యం

Teamindia తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు చేసింది. రెండో రోజు సైతం 430/3 స్కోరుతో పటిష్ఠ స్థితిలో ఉంది. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) స్కోరు వేగం పెంచాలన్న ఉద్దేశంతో షాట్లు ఆడి ఔటవ్వారు. ఇక ఆ తర్వాత 41 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 471 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరుణ్ నాయర్ (0), రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) ఏమాత్రం ప్రభావం చూపలేదు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 333/4 స్కోరుతో పటిష్ఠ స్థితిలో ఉన్న టీమిండియా 31పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి 364 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జోష్ టంగ్ వేసిన 90వ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను పెద్ద దెబ్బ కొట్టింది.

Teamindia భారమంతా బుమ్రాపైనే..

బౌలింగ్‌లోనూ టీమిండియా పూర్తిగా బుమ్రాపైనే ఆధారపడింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్.. 465 పరుగులకు ఆలౌటయ్యి 6 పరుగుల లీడ్ ఇండియాకు దక్కింది. అతనికి అండగా సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్ వేసినా.. ధారాళంగా పరుగులిచ్చారు. శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్ గిల్ సరిగ్గా వాడుకోలేదు. అసలు అతను ఉన్నాడనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వికెట్ తీయలేకపోవడం పెద్ద మైనస్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు తెలివిగా బుమ్రా బౌలింగ్లో పూర్తి డిఫెన్స్ ఆడి మిగతా బౌలర్లపై ప్రతాపం చూపించారు.

పదే పదే క్యాచ్ డ్రాప్‌లు..

లడ్డూలాంటి క్యాచ్‌లను డ్రాప్ చేసి టీమిండియా ఫీల్డర్లు ఇంగ్లాండ్‌కు మంచి ఫేవర్ చేశారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ 4 లడ్డూ లాంటి క్యాచ్‌లు మిస్ చేసి మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా ఇంగ్లాండ్‌కు అప్పజెప్పాడు. రవీంద్ర జడేజా, పంత్ సైతం క్యాచ్‌లు మిస్ చేశారు. క్యాచ్ డ్రాప్‌ల ఫలితంగా ఓలీపోప్, డకెట్, హ్యారీ బ్రూక్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. క్యాచ్ డ్రాప్‌ల ఫలితం 196 పరుగులు. ఇది డిసైడింగ్ ప్యాక్టర్‌గా మారింది. అవే పరుగులు లీడ్ రూపంలో ఉంటే.. ఇండియా మ్యాచ్ గెలిచేది లేదా ఎట్ లీస్ట్ డ్రా అయ్యేది.

ఇంగ్లాండ్ స్ట్రాటెజీ తెలిసి కూడా..

ఇంగ్లాండ్ ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఛేదనకు పెట్టింది పేరు. ఈ స్టేడియంలో ఫోర్త్ ఇన్నింగ్స్‌లో చాలా సార్లు ఆ జట్టు విజయాలు సాధించింది. 2019, 2023 లో ఆస్ట్రేలియాపై, 2022 లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయాలు సాధించింది. ఆ జట్టు స్ట్రాటెజీ ప్రకారం రెండో బ్యాటింగ్ ఎంచుకుని.. తమ కండీషన్లను బాగా యుటిలైజ్ చేసుకుంటుంది. ఇంగ్లాండ్ స్ట్రాటెజీ తెలిసి కూడా దానికి తగ్గట్లు ఆడడంలో Teamindia విఫలమైంది. దీన్ని బట్టి ఇంగ్లాండ్‌కు ఫోర్త్ ఇన్నింగ్స్‌లో 450పైనా లీడ్ ఉండేలా చూసుకోవాల్సింది.

India vs England 1st Test Playing 11 :

ఇండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

Also Read : India vs England 1st Test : Teamindia పొర‘పాట్లు’.. ఇంగ్లాండ్ గెలిచేట్లు 



Leave a Comment