Nitish Kumar Reddy భారత క్రికెట్ లో యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ లో సెంచరీ చేసిన సమయంలో తాను ధరించిన షూస్ టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఇచ్చినవే అని చెప్పాడు. ఆ షూస్ ధరించి తాను సెంచరీ చేసినట్లు నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు.
కఠినమైన బౌన్సీ పిచ్ ను ఎదుర్కొని..
అయిదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 2024-25 బోర్డర్ గవాస్కర్ సిరీస్ (Border Gavaskar Trophy)లో నితీశ్ కుమార్ (Nitish Kumar Reddy) రెడ్డిని ఎంపిక చేశారు. దీనికి నితీశ్ కుమార్ రెడ్డి సరైన న్యాయం చేశాడు. కఠిన మైన ఫాస్ట్ బౌన్స్ పిచ్ లపై సూపర్ బ్యాటింగ్ చేశాడు. సీనియర్లు విఫలమవుతున్న సమయంలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బోలాండ్ లాంటి బౌలింగ్‌ను ఎదుర్కొని ప్రతి మ్యాచ్ లో రాణించాడు. కీలకమైన సమయంలో వికెట్లు కూడా తీసి శభాష్ అనిపించుకున్నాడు.

ఆ షూస్ వేసుకునే సెంచరీ చేశా
మెల్ బోర్న్ (Melbourne Cricket Ground) టెస్ట్ మ్యాచ్ కు ముందు విరాట్ కొహ్లీ (Virat Kohli) డ్రెస్సింగ్ రూంలో సర్ఫరాజ్ ఖాన్‌ను నీ షూ సైజ్ ఎంత అని అడిగాడు. అప్పుడు సర్ప్ రాజ్ ఖాన్ (Sarfaraz Khan) 9 అని చెప్పాడు. వెంటనే తన వైపు చూసిన విరాట్ కొహ్లీ నితీశ్ నీ షూ సైజ్ ఎంత అని అడగాగానే 10 అని చెప్పేశా. వెంటనే ఈ షూ నీకు సరిపోతాయి తీసుకో అన్నాడు. ఆ షూ తీసుకుని నెక్ట్స్ మ్యాచ్ లో వాటినే ధరించే సెంచరీ చేశా. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకం అని నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో మెల్ బోర్న్ లో చేసిన సెంచరీ టీం ఇండియాకు ప్రత్యేకంగా నిలిచింది. ఈ సమయంలో కామెంటరీ బాక్సులో కూర్చున్న ఇర్పాన్ పఠాన్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ ఎమోషనల్ అయి ఏడ్చేశారు.
ఐపీఎల్ లో రాణించడంతోనే..
2025 ఐపీఎల్ వేలానికి ముందు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో నితీశ్ కుమార్ రెడ్డి ఒకడు.ఐపీఎల్ 2024లో 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులను 142.92 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు. దీంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) తరపున అతను చేసిన ప్రదర్శనల ఆధారంగానే బంగ్లాదేశ్‌తో జరిగే స్వదేశంలో జరిగే టీ 20 సిరీస్‌కు నితీశ్ భారత్‌కు ఎంపికయ్యాడు.