Zaheer Khan fires at pitch curator: పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Ekana Stadium)మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 22 బంతులు మిగిలి ఉండగానే లక్నో ను చిత్తు చేసింది. లక్నో లోని ఏకాన స్టేడియంలో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 171 పరుగులు మాత్రమే చేసింది. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ అలవోకగా టార్గెట్ ను ఛేజ్ చేసింది. దీంతో లక్నో బౌలింగ్ కోచ్ భారత సీనియర్ క్రికెటర్ జహీర్ ఖాన్ పిచ్ క్యూరేటర్ పై ఫైర్ అయ్యాడు. ఇది లక్నో పిచ్ లా కనిపించడం లేదు. పంజాబ్ క్యూరెటర్ ( Pitch Curator) తయారు చేసినట్లు ఉంది అన్నాడు. వారి కోసమే ఇలా చేశాడేమో అనిపిస్తుందన్నాడు.
Zaheer Khan fires at pitch curator: పిచ్ నాసిరకం
పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండాల్సింది. మా లక్నో టీం ఇప్పటికే ఫేస్ బౌలింగ్ విభాగంలో వీక్ గా ఉంది. బౌలర్లు గాయాలపాలయ్యారు. మేం నలుగురు స్పిన్నర్లతో ఆడుతున్నాం. కానీ పిచ్ ను మాత్రం ఫేస్ బౌలింగ్ కు అనుకూలంగా తయారు చేశారు. కనీసం హోం గ్రౌండ్ (Lucknow Supergiants) ఉన్న టీంకు అనుకూలంగా పిచ్ లు తయారు చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రేక్షకులు లక్నో టీం అభిమానులు మ్యాచు బాగా ఆడతారనే వస్తారు. కానీ ఇలా పిచ్ ను నాసిరకంగా తయారు చేస్తే ఎలా అన్నాడు.
కొట్టి పారేసిన చెన్నై కోచ్
2008 తర్వాత చెన్నై లో చెపాక్ స్టేడియంలో కూడా రాయల్ చాలెంజర్ బెంగళూరు టీం చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచింది. అది కూడా 50 పరుగుల తేడాతో.. దీంతో పిచ్ పై విమర్శలు వచ్చాయి. దీనికి చెన్నై కోచ్ ప్లెమింగ్ (Stephen Fleming)స్పందించాడు. పిచ్ ను బట్టి గేమ్ ఉండదని మేం ఎప్పుడు పిచ్ గురించి వ్యాఖ్యలు చేయం.. ఇదే విషయం మీకు గతంలోనూ చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. పిచ్ ను రీడ్ చేసి ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్ లో దాదాపు 7 నుంచి 8 గ్రౌండ్ లలో ఆడాలి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికి సిద్ధంగా ఉండాలనేది ప్లేయర్లు నేర్చుకోవాలి.

ఈడెన్ గార్డెన్ పిచ్ పై కోల్ కతా టీం కోచ్ అసంతృప్తి
కోలకతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కోచ్ చంద్రశేఖర్ కూడా ఈడెన్ గార్డెన్ పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టీంకు అనుకున్నట్లుగా పిచ్ ను తయారు చేయడం లేదని హోం గ్రౌండ్ లోనే ఇలా ఉంటే వేరే గ్రౌండ్ లోనే మ్యాచులు గెలవాలా అనే పరిస్థితి వచ్చిందని వాపోయినట్లు తెలిపింది. మొత్తం మీద జహీర్ ఖాన్ తమ ఆటగాళ్ల సత్తాను నమ్ముకోవాలని.. పిచ్ లు మ్యాచులు గెలిపించవని క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.