Ro-Ko బంధం: ఆ ఫలితమే మా అనుబంధం – విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మాజీ MI కెప్టెన్ రోహిత్ శర్మతో తన 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ బంధాన్ని గుర్తుచేసుకున్నారు. “రో-కో”గా ప్రసిద్ధి చెందిన ఈ జంట.. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో భారత్ కు మరో ఐసీసీ కప్ తెచ్చారు. తాజాగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న RCBvsMI మ్యాచ్ లో వీరు తలపడనున్నారు. 

ఇద్ధరం ఒకేసారి డెవెలప్ అయ్యాం

“17 ఏళ్లుగా ఒకే జట్టులో (భారత్ తరపున) ఆడుతున్నందున సహజంగానే మా మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. మేము కెరీర్ ప్రారంభం నుంచి ఆటపరంగా ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నాం. ఇరువురం ఒకేసారి కెరీర్లో డెవెలప్ అయ్యాం. ఈ బాండింగ్ ఒకరిమీద ఒకరికి ట్రస్ట్ అలాగే టీమ్ కోసం కలిసి పనిచేసిన ఫలితం.” అని విరాట్ చెప్పుకొచ్చాడు. విరాట్, రోహిత్ ఇద్దరూ భారత్ జట్టుకు కెప్టెన్లుగా పనిచేశారు.  ఒకరి హయాంలో మరొకరు ప్లేయర్ గా ఉన్నారు. ‘మేము సిచువేషన్ ను అర్థం చేసుకుని..టీమ్ కోసం ఎలా విజయం సాధించి పెట్టాలి అనే విషయం గురించి ఒకేవిధమైన ఆలోచనను కలిగి ఉండేవాళ్ళం’ అని విరాట్ తన అనుభవాన్ని తెలియజేశాడు. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

టెండూల్కర్ తరువాత.. 

ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ (27,599 పరుగులు), రోహిత్ (19,700 పరుగులు) ఇద్దరూ భారత్ జట్టుకు టెండుల్కర్ అనంతరం అత్యుత్తమ బ్యాటర్ లుగా కొనసాగుతున్నారు. ఇక 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అలాగే, 2024 T20 ప్రపంచ కప్  గెలిచిన జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. వీరిద్దరి కాంట్రిబ్యూషన్ భారత క్రికెట్ మరోస్థాయిలో ఉండడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. 

ఈసారి ఎవరిదో పైచేయి

ఇకపోతే ఐపీఎల్ టోర్నీలో MIపై విరాట్ 855 పరుగులు (SR 126) చేయగా.. RCBపై రోహిత్ 831 పరుగులు (SR 136) చేశారు. ఇక తాజాగా జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. ఇక ఐపీఎల్ 2025లో RCB ఇప్పటికే 2 విజయాలతో టాప్ 3లో ఉండగా.. MI 8వ స్థానంలో ఉంది. ఇది ఒక థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ అవుతుంది. రో-కో జంటలో ఎవరు ఈ మ్యాచ్ హీరో అవుతారో చూడాలి.  

Leave a Comment