Nicholas Pooran: ఐపీఎల్ 2025లో బ్యాటర్ల హవా కొనసాగుతూనే ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్ 200 పరుగులు దాటుతోంది. అయితే ఆరెంజ్ క్యాప్ వేటలో టీం ఇండియా బ్యాటర్ సాయి సుదర్శన్ దూసుకుపోతున్నాడు. సాయి సుదర్శన్ ఆడిన అయిదు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం అయిదు మ్యాచులకు 273 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
Nicholas Pooran
Nicholas Pooran: మొదట ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్ (Lucknow Supergiants) బ్యాటర్ నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. 283 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా ఉన్నాడు. నికోలస్ పూరన్ ఆడిన అయిదు మ్యాచుల్లో మూడు హాప్ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు.
మిచెల్ మార్ష్ సైతం
లక్నో కు చెందిన మరో బ్యాటర్ మిచెల్ మార్ష్ సైతం ఇదే పంథా కొనసాగిస్తున్నాడు. దూకుడు ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మిచెల్ మార్ష్ మొత్తం 265 పరుగులు చేసి మూడో స్థానంలో ఉండగా… గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ 200 స్కోరు చేసి నాలుగో ప్లేస్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ 199 పరుగులతో అయిదో స్థానంలో ఉన్నాడు.
పర్పుల్ క్యాప్ వేటలో..
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ 11 వికెట్లతో ఆడిన అయిదు మ్యాచుల్లో ముందుంజలో ఉన్నాడు. ముంబై కెప్టెన్ హర్దిక్ పాండ్యా, చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ 10 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. నాలుగు మ్యాచులు ఆడిన హర్దిక్ రెండో స్థానంలో నిలవగా.. అయిదు మ్యాచులు ఆడిన ఖలీల్ కు మూడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. కాగా సిరాజ్, సాయి కిశోర్ ఇద్దరు కూడా పది వికెట్లు తీసినా.. ఏకానమీ పరంగా సిరాజ్ నాలుగో స్థానం, సాయి కిశోర్ అయిదో స్థానంలో ఉన్నాడు. అటు శార్దూల్ ఠాకూర్, మిచెల్ స్టార్క్… ఇద్దరూ తొమ్మిదో వికెట్లు పడగొట్టి తర్వాత స్థానాల్లో ఉన్నారు.
నిరాశపరుస్తున్న టాప్ టీమ్స్
ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటివరకు అయిదు మ్యాచులు ఆడి కేవలం ఒక్క దాంట్లోనే గెలిచాయి. దీంతో ఆయా టీంలకు ఉన్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉండగా.. ఇక ముందు ఉండే మ్యాచుల్లో నైనా గెలిచి తమ సత్తా చాటాలని కోరుకుంటున్నాయి.