Will Sarfaraz Khan be removed without giving him a chance
Sarfaraz Khan: సర్పరాజ్ ఖాన్ (Sarfaraj khan) టెస్టు క్రికెట్ లో గతేడాది ఇంగ్లండ్ సిరీస్ లో అరంగ్రేటం చేశాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూడగా చివరకి అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయినా చివరికి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో అవకాశం ఇచ్చారు. అయిదు టెస్టుల్లో ఒక్క టెస్టులో కూడా ఆడే అవకాశం రాలేదు.

Sarfaraz Khan: సర్పరాజ్ ఖాన్ కు అవకాశం ఏదీ
జూన్ 20న జరగబోయే టెస్టు సిరీస్ కు బీసీసీఐ సెలెక్టర్లు టీం ఇండియాను ప్రకటించారు. అందులో సర్పరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వలేదు. దీంతో సెలెక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కు ఆడే అవకాశం ఇవ్వకుండా ఎలా తీసేస్తారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (sunil gavaskar) విమర్శించారు. గత కొన్ని సిరీస్ ల నుంచి చూస్తున్నాను. 13, 14, 15 స్థానాల్లో ఎంపికైన వారికి చాన్స్ ఇవ్వడం లేదు. ఇచ్చినా వారిని తీసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు.
అజిత్ అగార్కర్ వాదన ఇదీ
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (ajit agarkar) మాట్లాడుతూ.. న్యూజిలాండ్ సిరీస్ లో చివరి రెండు టెస్టు మ్యాచుల్లో సర్ఫరాజ్ ఖాన్ పెద్దగా రాణించలేడు. అందుకే అతడిని పక్కనపెట్టాం. అయినా 50 మందిని సెలెక్ట్ చేయలేం కదా అని అన్నారు. అగార్కర్ ఇచ్చిన వివరణ చాలా మందికి నచ్చడం లేదు. కానీ ఐపీఎల్ లో రాణిస్తున్న సాయి సుదర్శన్ కు , డొమెస్టిక్ క్రికెట్ లో రాణించిన కరుణ్ నాయర్ ( Karun nair) కు చాన్స్ ఇచ్చారు. దీంతో కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.