karun nair: కరుణ్ నాయర్ డియర్ క్రికెట్ చాన్స్ ఇచ్చింది

Dear Cricket gave me a chance

Karun Nair: టీం ఇండియా టెస్ట్ బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. ఇంగ్లండ్ కు వెళ్లే టెస్టు టీంలో చోటు లభించింది. అయితే అంతకుముందు కరుణ్ నాయర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టీం ఇండియా తరఫున టెస్టుల్లో 300 పరుగులు చేసిన క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వగ్ (verendra sehwag) , కరుణ్ నాయర్ ఇద్దరే. కానీ ఇద్దరు క్రికెటర్లలో ఒకరి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా సాగగా.. సంవత్సరం తిరిగే లోపు కరుణ్ నాయర్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో కరుణ్ నాయర్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆఖరుకు కర్ణాటక టీంలో కూడా చాన్స్ రాని పరిస్థితి నెలకొంది. దీంతో విదర్భకు మారిపోయాడు కరుణ్.

Karun Nair కౌంటీ, డొమెస్టిక్ లో టన్నుల కొద్దీ పరుగులు

విదర్భ జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ కు మంచి అవకాశం దొరికింది. విదర్భ టీంలో సీనియర్లు లేకపోవడంతో సీనియర్ గా మారిపోయాడు. గత సీజన్ లో విదర్భ రంజీ ట్రోపీ (Ranji trophy) గెలవడంతో పాటు సెంచరీల మోత మోగించాడు. ఏకంగా సీజన్ లో 5 సెంచరీలు చేసి తన సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అంతకు ముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ సిరీస్, డొమెస్టిక్ రంజీ సీజన్ లో సెంచరీలతో కదం తొక్కాడు. అవకాశాలు కోల్పోయిన సమయంలో ఇంగ్లండ్ వెళ్లి నార్తాంప్టన్ షైర్ తరఫున కౌంటీల్లో రాణించాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్లు రాణించడంతో ఫుల్ పామ్ అందుకున్నాడు.

వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు

కరుణ్ నాయర్ తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఎలాగైనా సరే మళ్లీ టీం ఇండియాలోకి అడుగుపెట్టాలని శతవిధాల ప్రయత్నించాడు. ఏకంగా ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు టీంలో స్థానం లభించింది. దీని కోసం కఠోన శ్రమ చేశాడు. కరుణ్ నాయర్ ఎంట్రీతో విరాట్ స్థానాన్ని భర్తీ చేయలేకున్నా.. ఒక సీనియర్ గా రాణిస్తాడనే నమ్మకం బీసీసీఐ ( bcci ) తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు.

డియర్ క్రికెట్ అంటూ ఎమోషనల్ పోస్టు

కరుణ్ నాయర్ డియర్ క్రికెట్ (dear cricket) అంటూ 2022 లో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. కరుణ్ నాయర్ ఈ పోస్టు పెట్టిన అనంతరం రెండున్నర సంవత్సరాల తర్వాత టీం ఇండియాలో చోటు లభించింది. దీంతో నీ కల నిజమైంది ఇక నువ్వేంటో నిరూపించుకోవడమే తరువాయి అంటూ సోషల్ మీడియా హోరెత్రిపోతుంది. ఇంగ్లండ్ కు ఎంపికైన 18 మంది జట్టులో 33 సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ కావడం విశేషం.

Leave a Comment