Priyank Panchal: ఎన్నో ఏళ్ల కల నెరవేరకుండానే స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Star cricketer retires without fulfilling his long standing dream

Priyank Panchal: క్రికెట్ అంటేనే ఎమోషన్. చాలా మంది క్రికెటర్లు ఇండియా జర్సీ ధరించి టీం ఇండియాకు ఆడాలని కలలు కంటారు. అందులో చాలా తక్కువ మందికే ఇండియా క్యాప్ పెట్టుకుని జర్సీ ధరించి దేశం తరఫున ఆడే అవకాశం వస్తుంది. ఎంతో టాలెంట్ ఉన్నా టన్నుల కొద్దీ పరుగులు చేసినా అవకాశం రాకపోవచ్చు. అలా ఎంతో మంది క్రికెటర్లు రిటైరైనా వాళ్లు ఉన్నారు. అదే కోవకు చెందుతాడు గుజరాత్ కు చెందిన ప్రియాంక్ పంచాల్ (Priyank Panchal). 35 ఏళ్ల ప్రియాంక్ పంచాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు మే 26, 2025 నాడు రిటైర్మెంట్ ప్రకటించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గుజరాత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించాడు. ప్రియాంక్ చివరి సారిగా కేరళతో జరిగిన రంజీ మ్యాచులో 148 రన్స్ సాధించాడు. కాగా ఈ మ్యాచులో రెండు రన్స్ తేడాతో గుజరాత్ ఫైనల్ చేరడంలో విఫలం అయింది.

గుజరాత్ కు రంజీ ట్రోపీ అందించిన ప్రియాంక్ పంచాల్

2016 – 17 రంజీ సీజన్ లో ప్రియాంక్ పంచాల్ గుజరాత్ జట్టు తరఫున ఏకంగా 1300కు పైగా పరుగులు సాధించాడు. ఇప్పటికీ రంజీ ట్రోపీలో ( Ranji Trophy) అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ప్రియాంక్ పంచాల్ పేరు పైనే ఉండటం గమనార్హం. అంతకుముందు సీజన్ లో గుజరాత్ విజయ్ హాజరే ట్రోపీ గెలవగా అందులో కూడా ప్రియాంక్ పంచాల్ రాణించాడు. ప్రియాంక్ పంచాల్ 97 లిస్ట్ ఏ (India A List) మ్యాచులు ఆడి ఎనిమిది సెంచరీలు చేశాడు. టీ 20ల్లో 59 మ్యాచులు ఆడాడు. ఇండియా ఎ తరపున ఆడినప్పటికీ, అతనికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశం రాలేదు. ఐపీఎల్‌ లో కూడా అతడికి అవకాశం రాలేదు.

Priyank Panchal: ప్రియాంక్ ఎమోషనల్ పోస్టు

చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయనను చూసి స్ఫూర్తి పొందుతారు. మెప్పించాలని అనుకుంటారని పంచాల్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ‘నేను కూడా అలాంటివాడినే. నా నాన్న నాకు ఎప్పటికీ శక్తి ఇచ్చే సోర్స్. నేను కలల దిశగా సాగేందుకు ఆయన నాకు ప్రోత్సాహం ఇచ్చారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన నేను ఇండియా క్యాప్ ధరిస్తానన్న ఆశయంతో ఎదగాలన్న తపన ఇవన్నీ ఆయనవల్లే వచ్చాయి. ‘ఆయన చాలా కాలం క్రితమే మమ్మల్ని విడిచిపోయారు. ఈ కలను నేను రెండు దశాబ్దాల పాటు, ప్రతి సీజన్‌లోనూ మోసుకెళ్లాను. ఈ రోజుతో నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ (India A List) కు వీడ్కోలు పలుకుతున్నాను అని ప్రియాంక్ పంచాల్ ఎమోషనల్ పోస్టు చేశారు.

Leave a Comment