love proposal to zaheer khan: ఇండియా, పాకిస్థాన్ (india vs pakistan) మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్‌లో సాగుతుంది. టెస్ట్, వన్డే, టీ 20 ఏ మ్యాచ్ అయినా రెండు దేశాల క్రికెట్ అభిమానులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. కానీ ఇండియా, పాక్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు అక్కడ ఒక ప్రేమ సన్నివేశం జరిగింది. ఇది క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తిండిపోయే సీన్.
బెంగళూరులో (bengaluru) 2005 టెస్టు మ్యాచ్ లో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ (virendra sehwag) బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూంలో టీం ఇండియా క్రికెటర్లు హాయిగా కూర్చుని మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో ఓ కెమెరామెన్ చేసిన పనికి స్టేడియంతో సహా అందరూ నవ్వుకున్నారు. స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ అమ్మాయి ఐ లవ్ యూ జహీర్ ఖాన్ (zaheer khan) అని పోస్టర్ పట్టుకుని కూర్చుంది. దీన్ని కెమెరామ్యాన్ ఎక్కువగా సేపు చూపించారు. అప్పుడు కామెంట్రీలో ఉన్న అరుణ్ లాల్ తో సహా ఇతర కామెంటర్లు దీనిపై కామెంట్ చేశారు.

డ్రెస్సింగ్ రూం అంతా ఫన్..
అదే పనిగా అమ్మాయిని చూపించడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఐ లవ్ యూ అంటూ పట్టుకున్న ఫ్లకార్డును చూసి డ్రెస్సింగ్ రూంలో కూర్చున్న యువరాజ్ సింగ్ (yuvraj singh) కూడా జహీర్‌ను టీజ్ చేయడం మొదలు పెట్టాడు. అమ్మాయిని చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వమని జహీర్‌ను కోరాడు. ఒక్కసారి కాదు పదే పదే అడగడం వల్ల జహీర్ ఖాన్ కూడా ఆ అమ్మాయిని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేశాడు. డ్రెస్సింగ్ రూం, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ (virendra sehwag) కూడా ఫుల్‌గా నవ్వుకున్నారు.
బోరింగ్ మ్యాచ్ కాస్త ఇంట్రస్టింగ్ గా..
దీంతో అప్పటి వరకు బోరింగ్‌గా ఉన్న మ్యాచ్ కాస్త లవ్ ట్రాక్‌తో ఫుల్ క్రేజీగా మారిపోయింది. ప్రతి పేపర్‌లో చానల్‌లో దీని గురించే హాట్ టాపిక్‌గా చర్చ నడిచింది. అసలు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా ఇలాంటి ఒక సన్నివేశం జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? ఎప్పుడు నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలు జరిగే స్టేడియాల్లో లవ్ ట్రాక్ జరగడం విశేషం. అయితే అందరి క్రికెటర్ల లాగే జహీర్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయాణం సాగించాడు. బాలీవుడ్ హీరోయిన్ సాగరికను ( heroin sagarika) 2017 లో పెళ్లి కూడా చేసుకున్నాడు. జవగళ్ శ్రీనాథ్ తర్వాత ఇండియా తరఫున ఎక్కువ గా లీడ్ తీసుకుని బౌలింగ్ చేసింది జహీర్ ఖాన్ అని ఈజీగా చెప్పొచ్చు. 2003 వరల్డ్ కప్ తర్వాత జవగళ్ శ్రీనాథ్ రిటైర్ మెంట్ ప్రకటించారు. అంతకుముందు నుంచే జహీర్ ఖాన్ టీం ఇండియాకు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందారు.
జహీర్ ఖాన్ 2011 వరల్డ్ కప్ (2011 world cup) గెలిచిన జట్టులో సభ్యుడు. ఈ సిరీస్‌లో 21 వికెట్లు తీసి భారత్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు టెస్టుల్లో 311, వన్డేల్లో 280కి పైగా వికెట్లు తీశాడు. భారత జట్టు ఫేస్ బౌలింగ్ విభాగంలో తడబడుతున్న సమయంలో జహీర్ ఖాన్ పెద్దన్న పాత్ర పోషించి అనేక క్లిష్ట సమయాల్లో తన స్వింగ్, సీమ్, ఫేస్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.