Will Punjab Kings win the IPL Cup: ఐపీఎల్ (Ipl) ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటి వరకు కప్ కొట్టని జాబితాలో ఆశించిన స్థాయిలో ఆడని జట్లలో పంజాబ్ కింగ్స్ ముందు వరుసలో ఉంటుంది. మేటి ఆటగాళ్లు ప్రాధాన్యం వహించినా జట్టు టోర్నీలో ఎప్పుడూ పాయింట్ల పట్టికలో వెనకంజలోనే ఉంటుంది. ముఖ్యంగా కీలక మ్యాచుల్లో ఒత్తిడి తట్టుకుని నిలబడలేకపోవడం పంజాబ్ కింగ్స్ బలహీనత. వీరికి లక్ కూడా అంతగా కలిసి రాలేదని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 2014లో ఐపీఎల్ ఫైనల్ చేరడం అత్యుత్తమ ప్రదర్శన కాగా.. అక్కడ విఫలమైన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు.
భారీ రేటు పెట్టి శ్రేయస్ ను తీసుకుని
గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కప్ అందించిని శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఈ సారి పంజాబ్ కింగ్స్ ను గట్టెక్కిస్తాడని కోటి ఆశలు పెట్టుకుంది ఆ జట్టు యాజమాన్యం. అందుకే బోలెడన్నీ డబ్బులు పోసి శ్రేయస్ ను కొని తెచ్చుకుంది. ఏకంగా ఐపీఎల్ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచిపోయాడు. రూ. 26. 75కోట్లు వెచ్చించి మరీ తమ జట్టులోకి తీసుకుంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి..
బీసీసీఐ (bcci) సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి శ్రేయస్ అయ్యర్ ను తొలగించిన తర్వాత శ్రేయస్ కు గడ్డు కాలం నడిచింది. దేశీయ క్రికెట్ ఆడాలని విధించిన నిబంధనను కాదన్నందుకు శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. 2024 ఐపీఎల్ సమయంలో మాత్రం కేకేఆర్ జట్టును ముందుండి నడిపించాడు. అంతే కాకుండా భారత క్రికెట్ జట్టు నుంచి కూడా ఉద్వాసన పలికారు. దీంతో రంజీ ట్రోపీలో ఆడి తిరిగి ఇండియాకు ప్రాధాన్యం వహించాడు. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోపీలో నిలకడైన ఆటతీరుతో తన సత్తా నిరూపించుకున్నాడు. ఏకంగా టైటిల్ సాధించి తన సత్తా ఎంటో నిరూపించాడు. కానీ శ్రేయస్ కు కాకుండా క్రెడిట్ మొత్తం కోచ్ గౌతమ్ గంభీర్ (Goutam Gambhir)కు దక్కింది.

కొత్త కోచ్ రికీ పాంటింగ్ ఏం చేస్తాడో చూడాలి
వీరేంద్ర సెహ్వాగ్, కేఎల్ రాహుల్, జార్జ్ బెయిలీ లాంటి గొప్ప క్రికెటర్లతో సాధ్యం కానీ ఫీట్‌ను శ్రేయస్ సాధిస్తాడా.. చూడాలి. పంజాబ్ కింగ్స్ కు నిలకడ లేమి, సమిష్టితత్వం లోపం ఎప్పుడూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కొత్త కోచ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను (ricky ponting) నియమించుకున్నారు. ఇటు కొత్త కెప్టెన్, అటు కొత్త కోచ్ తో టైటిట్ రేసులో నిలుస్తారా.. ఎప్పటిలాగే పాత కథన చూపిస్తారో చూడాలి.

చాహల్ పైనే స్పిన్ భారం
స్పిన్ విభాగంలో ఈ సారి యుజ్వేంద్ర చాహల్ ను (Yuzvendra chahal) పంజాబ్ టీం రూ. 18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మెయిన్ బౌలర్లుగా చాహల్, అర్ష్ దీప్ సింగ్ మాత్రమే పంజాబ్ కింగ్స్ కు ఉన్నారు. కాగా రంజీల్లో యువ సంచలనం ముషీర్ ఖాన్ ను తీసుకున్నారు. ముంబయికి బాగా ఆడిన నెహాల్ వదేరా (nehal vadera) పై కూడా నమ్మకం పెట్టుకున్నారు. అటు విదేశీ ప్లేయర్లు మ్యాక్స్ వెల్, స్టాయినిస్, ఆరోన్ హర్డీ, జోస్ ఇంగ్లీష్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా షెహజాదీని ఆల్ రౌండర్ విభాగంలో తీసుకున్నారు. మొత్తం మీద పంజాబ్ కింగ్స్ (panjab kings) కొత్త టీంతో ఇప్పటికైనా విజయాల బాట పట్టి టైటిల్ రేసులో ముందు నడవాలని యాజమాన్యం ఆశిస్తోంది.
విదేశీ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో..
మ్యాక్స్ వెల్, (glen maxwell) మార్కస్ స్టానియిస్ లాంటి విదేశీ ఆటగాళ్లు రాణించడంపై పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. వీరిని బోలెడన్నీ డబ్బులు పోసి కొనుక్కుంది పంజాబ్ కింగ్స్. ఇప్పటికే 2008 నుంచి టైటిల్ రేసులో వెనకబడి తీవ్ర నిరాశలో ఉన్న పంజాబ్ కు ఈ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమేరకు న్యాయం చేస్తారో చూడాలి. వీరితో పాటు జోష్ ఇంగ్లిష్, అజ్మతుల్లా, ఫెర్గూసన్ లాంటి స్టార్ ఆటగాళ్లు బాగా ఆడితేనే పంజాబ్ కు ఏమైనా విజయావకాశాలు ఉంటాయి. గత సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన మార్కో యాన్సెన్ కూడా పంజాబ్ జట్టు లో చేరిపోయాడు. నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్ల నిబంధన ఉండగా.. మ్యాక్స్ వెల్, స్టాయినిస్ తుది జట్టులో తప్పకుండా ఉంటారు. మిగతా ఇద్దరిలో ఎవరినీ ఉంచుతారనే దానిపైనే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
శశాంక్ సింగ్ పై ఆశలు
ఫేస్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్ (arsha deep singh) పైనే పూర్తిగా ఆధారపడింది పంజాబ్ కింగ్స్ టీమ్. శ్రేయస్ అయ్యర్ తర్వాత బలమైన భారత బ్యాటర్ ఒక్కరు కనిపించకపోవడం ఇక్కడ ప్రధానంగా లోపించిన అంశం. గతేడాది బాగా ఆడిన శశాంక్ సింగ్ పైనే పంజాబ్ భారీ ఆశలు పెట్టుకుంది. అశుతోష్ శర్మ లాంటి రాణించిన బ్యాటర్ ను పంజాబ్ కింగ్స్ వేలంలో కొనుక్కోలేక పోవడం ఆ జట్టు యాజమాన్యం చేసిన అతి పెద్ద తప్పని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు ఆడకపోయినా.. తాము ఉన్నామని నిరూపించిన ఆటగాళ్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ. వీరిలో ఇద్దరిని రిటెన్షన్ చేసుకుంటారని అంతా భావించినా.. ఒక్క శశాంక్ సింగ్ (shashank singh) నే తీసుకున్నారు.
పంజాబ్ టీమ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, చాహల్, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, నెహాల్ వదేరా, వైశాఖ్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, పైలా అవినాష్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబె, ప్రియాంశ్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెగ్డే, కుల్‌దీప్ సేన్.
విదేశీయులు: స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, జోస్ ఇంగ్లిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా, ఆరోన్ హార్డీ, లాకీ ఫెర్గూసన్, బార్ట్‌లెట్.