IPL starts in a few days: ఇంకొన్ని రోజుల్లోనే ఐపీఎల్ స్టార్ట్

IPL 2025: మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఈ సారి మా జట్టు బలంగా ఉంది అంటే మాది బలంగా ఉందని ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు.

12 డబుల్ హెడర్ మ్యాచులు

టాటా ఇండియన్ ప్రీమియల్ లీగ్ 18వ ఎడిషన్ మార్చి 22న మొదటి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మే 25, 2025 జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. 2025 ఐపీఎల్ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు 13 వేదికల్లో జరగనున్నాయి. 12 డబుల్ హెడర్ మ్యాచులు ఉండనున్నాయి. మార్చి 22, 2025న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఒకే రోజు రెండు మ్యాచుల్లో మొదటిది మార్చి 23, 2025న హైదరాబాద్‌లో జరగనుంది. మధ్యాహ్నం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రాజస్థాన్ రాయల్స్ (RR)తో తలపడుతుంది. సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముంబై ఇండియన్స్ (MI) జట్లు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తలపడతాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ కు రెండో హోం విశాఖ

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మార్చి 24, 2025న విశాఖపట్నంలో ఈ సీజన్‌లో వారి తొలి మ్యాచ్ ఆడతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సీజన్‌లో వారి తొలి మ్యాచ్‌ను మార్చి 25, 2025న గుజరాత్ టైటాన్స్ (GT) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతుంది.

హైదరాబాద్ లోనే క్వాలిఫైయర్ మ్యాచులు

పది (IPL) జట్లలో మూడు జట్లు ఒక్కొక్కటి 2 వేదికలలో ఆడతాయి. (DC) తమ సొంత మ్యాచ్‌లను విశాఖపట్నం, న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడతాయి. RR తమ రెండు హోమ్ మ్యాచ్‌లను గౌహతిలో ఆడుతుంది. అక్కడ వారు (KKR ),(CSK)తో తలపడనున్నారు. మిగిలిన హోమ్ మ్యాచ్‌లను జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆడతారు. (PBKS) తమ నాలుగు హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌లోని న్యూ PCA స్టేడియంలో ఆడనుంది. ధర్మశాలలో (PBKS) మూడు హోం మ్యాచులను ఆడనుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత, ప్లేఆఫ్‌లు హైదరాబాద్ కోల్‌కతాలో జరుగుతాయి. హైదరాబాద్ లో వరుసగా మే 20, 21, క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్‌కు ఆతిథ్యం ఇస్తుంది. మే 23, 2025న క్వాలిఫైయర్ 2కు కోల్ కతా ఆతిథ్యం ఇస్తుంది.

Leave a Comment