Punjab Kings: పంజాబ్ కింగ్స్ ఈ సారైనా ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ నెగ్గాలని జట్టును పూర్తిగా ప్రక్షాళన చేశారు. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ ను నియమించారు. గత సీజన్‌లో కెప్టెన్‌గా కోల్ కతాకు విజయాన్ని అందించిన శ్రేయస్ అయ్యర్ (shreyas Iyer)ను భారీ రేట్ పెట్టి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను నియమించింది. దీంతో ఈ సారి కప్ రేసులో పంజాబ్ జట్టు కూడా ఉందని చెప్పకనే చెప్పేసింది.

కోచ్ రికీ పాంటింగ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతాడు
పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్తగా నియమితుడైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (shreyas Iyer) నూతన కోచ్ రికీ పాంటింగ్ (ricky ponting) పై విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఆటగాళ్లు అందరికీ మంచి మద్దతు ఇస్తాడని అన్నాడు. నేను అతనితో మొదటిసారి పనిచేసినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాను అన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా క్రికెట్ కు సేవలందించిన రికీ పాంటింగ్ కోచ్ గా ఉండటం అదృష్టమన్నారు. ఆయన టీంలో నింపే ఆత్మవిశ్వాసం వేరే లెవల్ లో ఉంటుందన్నాడు. చండీగఢ్‌లో జరిగిన మీడియా సమావేశంలో అయ్యర్ టీం, కోచ్ రికీ పాంటింగ్ గురించి చెప్పాడు.

ట్రోఫీ గెలవడమే లక్ష్యం
ఈసారి ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ricky ponting, అయ్యర్ ఇద్దరూ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కలిసి పనిచేశారు. ఒకరి గురించి మరొకరి పూర్తిగా తెలుసు. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ జట్టులో చేరారు. అయ్యర్ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న క్రీడాకారుడు. గత సీజన్ లో ఎలా ఆడాడు. టీంను ఎలా ముందుకు నడిపించాడో అందరూ చూశారు. గత సీజన్ ఐపీఎల్ విజేత శ్రేయస్ ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ ను విజేతగా నిలబెడతాని నమ్మకం ఉందని కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. నాణ్యమైన విదేశీ ఆటగాళ్లతో పాటు భారత్ లోని సత్తా ఉన్న ప్లేయర్లు పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మేం ట్రోఫీ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, గేమ్ ప్లాన్ తో ముందుకు వెళితే విజయం సాధించొచ్చని రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి సెషన్ జరిగింది. ఇందులో యువ క్రికెటర్లు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు.

ఏ టీంతో మొదటి మ్యాచ్ అంటే
పంజాబ్ కింగ్స్ 2025 లో తన మొదటి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఆ తర్వాత జట్టు రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే రెండు హోమ్ మ్యాచ్‌ల కోసం వారి స్వస్థలం, న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఎ స్టేడియంకు తిరిగి వస్తుంది. ఈ సారి విదేశీ ఆటగాళ్లలో ఎక్కువగా ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉన్నారు. ఫేస్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, స్పిన్ భారం మొత్తం యుజ్వేంద్ర చాహల్ మీదనే ఉంది. బ్యాటింగ్ లో విదేశీ ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్ ఎలా రాణిస్తారనేది పంజాబ్ కింగ్స్ విజయాలపై ఆధారపడి ఉంటుంది.