Eyes on Rishabh Pant and Shreyas Iyer : పంత్, అయ్యర్ పైనే దృష్టంతా.. ఎందుకంటే?

Rishabh Pant and Shreyas Iyer: ఐపీఎల్ అంటేనే ఆటగాళ్లకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు సరిగా రాణించకపోతే మాత్రం వారి భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. 2025 ఐపీఎల్ కోసం రిషబ్ పంత్, (Rishabh Pant)శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, హెన్రిచ్ క్లాసెన్, లాంటి ఆటగాళ్లకు ఏకంగా 23 కోట్లకు పైనే ఆయా ఫ్రాంచైజీలు డబ్బులు వెదజల్లాయి. అయితే వీరు ఎలా రాణిస్తారో అని ఆయా ఫ్రాంచైజీల ఓనర్లు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Rishabh Pant : రిషబ్ పంత్ రెడీ

రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని క్రికెట్ లో రాణించినా భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్. గత సీజన్ ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు అసలు క్రికెట్ ఆడతాడని అనుకోలేదు. గాయం నుంచి కోలుకుని టీం ఇండియాలో చోటు సంపాదించాడు. ఇప్పుడు ఐపీఎల్ లో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు. లఖ్ నవూ జట్టు ఏకంగా 27 కోట్లు కుమ్మరించి ఐపీఎల్ లోనే అత్యధిక ధర పెట్టింది. దీంతో రిషబ్ పంత్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.

Shreyas Iyer :శ్రేయస్ అయ్యర్ పై పంజాబ్ కింగ్స్ ఆశలు

శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), అనగానే గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గుర్తుకువస్తాడు. పది సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురు చూసిన కోల్ కతా నైట్ రైడర్స్ కు మూడో సారి ఐపీఎల్ కప్ అందించిన కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. కానీ అనూహ్యంగా కోల్ కతా టీం అతడిని వేలంలోకి వదిలేసింది. ఎవరూ కూడా కప్ అందించినా ఆటగాడిని దూరం చేయాలని అనుకోరు. కానీ కోల్ కతా ఫ్రాంచైజీ ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ సారి పంజాబ్ కింగ్స్ (Punjab Kings) శ్రేయస్ ను 26. 5 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ కప్ వేటలో శ్రేయస్ ఎలా ముందుకు సాగుతాడో చూడాలి.

luck work for Venkatesh Iyer వెంకటేశ్ అయ్యర్ కు కలిసొచ్చిన లక్

వెంకటేశ్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. రూ. 23.75 కోట్లతో కోల్ కతా టీం వారి వద్దే ఉంచేసుకుంది. గత సీజన్ లో అద్భుతంగా వెంకటేశ్ అయ్యర్ అద్బుతంగా రాణించాడు. కోల్ కతా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరీ ఈ సారి భారీ ధరకు న్యాయం చేస్తాడో లేదో చూడాలి. ఈ సారి వైస్ కెప్టెన్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. రూ. 2 కోట్ల తో అమ్ముడుపోయిన రహనెను కెప్టెన్ గా 23.75 కోట్లకు అమ్ముడుపోయిన వెంకటేశ్ అయ్యర్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించడం కాస్త ఆశ్చర్యాన్ని కలగించకమానదు

They also poured crores of rupees into them. వీళ్లకూ కోట్లు కుమ్మరించారు

ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) రూ. 16.50 కోట్లు, యశస్వి జైశ్వాల్ రూ. 18 కోట్లు, రుతరాజ్ గైక్వాడ్ రూ. 18 కోట్లు, యుజ్వేంద్ర చాహల్ రూ. 18 కోట్లు, అర్షదీప్ రూ. 18 కోట్లు, జోప్రా అర్చర్ రూ. 18 కోట్లు అమ్ముడుపోయారు. ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం ఇదే మొదటి సారి. ఇలా వీరందరితో పాటు ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, హర్దిక్ పాండ్యా, విరాట్ కొహ్లీ, రజత్ పటిదార్, భువనేశ్వర్ కుమార్ అందరూ 10 కోట్లకు పైగా పలికిన వారే. ఎవరూ రాణిస్తారో ఎవరూ చేతులెత్తేస్తారో.. చూడాలి. మొత్తం మీద ఐపీఎల్ 2025 సీజన్ 18 ( IPL 2025) సీజన్ కు అన్ని రెడీ అయ్యాయి. సిక్సుల మోతలు, అభిమానుల కేరింతలకు రెడీ అవండి.

Leave a Comment