Andy Flower: ఐపీఎల్ కొత్త నిబంధన ఆర్సీబీ కోచ్ అండీఫ్లవర్ ఎమన్నాడంటే

Andy Flower: 2008 ఐపీఎల్ ప్రారంభం అయిన నాటి నుంచి ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 ఐపీఎల్ సీజ‌న్ (IPL 2025) మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుండ‌గా.. మంచు ప్ర‌భావం (due factor) కార‌ణంగా రెండో ఇన్సింగ్స్ లో బౌలింగ్ చేసే జ‌ట్టుకు కొన్ని బాధల నుంచి త‌ప్పించ‌డానికి ఐపీఎల్ యాజమాన్యం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రెండు జ‌ట్ల‌కు స‌మాన అవ‌కాశాలు క‌లిగించేలా రెండో ఇన్సింగ్స్ లో ఫీల్డింగ్ జ‌ట్టు అంపైర్ కు అప్పీల్ చేసుకుని 11 వ ఓవ‌ర్ త‌ర్వాత త‌డి బంతి స్థానంలో మ‌రో బాల్ తీసుకోవ‌చ్చు.

కొవిడ్ 2019 నుంచి ఆ విష‌యంలో బ్యాన్

2025 ఐపీఎల్ (IPL 2025) సీజ‌న్ లో బంతికి ఉమ్ము (లాలాజ‌లం) రాసేందుకు అనుమతి ఇచ్చారు. 2019 కొవిడ్ 19 త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా కూడా క్రికెట్ లో బాల్స్ కు లాలాజలం రాసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. క‌రోనా కార‌ణంగా దీన్ని బ్యాన్ చేశారు. కాగా ఈ సీజ‌న్ లో బీసీసీఐ బాల్ కు ఇలా రాసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీనిపై చాలా మంది క్రికెట‌ర్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

బౌల‌ర్ల‌కు కూడా ప‌ట్టు దొరుకుతుంది

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (Varun Chakravarthy) 11 వ ఓవ‌ర్ త‌ర్వాత బాల్ ను మార్చ‌డం బౌల‌ర్ కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌న్నాడు. ఇలా చేయ‌డం చాలా సంతోష‌క‌ర‌మ‌న్నారు. పూర్తిగా బ్యాట‌ర్ల ఆదిప‌త్యం చెలాయించ‌కుండా బౌల‌ర్ల‌కు కూడా ప‌ట్టు దొరుకుతుండద‌ని అన్నాడు. దీని వ‌ల్ల వికెట్లు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌న్నాడు. ఇది బౌలింగ్ జ‌ట్టుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నాడు. ఇలాంటి మార్పుల‌తో రెండు జ‌ట్లు స‌మానంగా పోటీ ప‌డే అవ‌కాశం ఉంటుంద‌న్నాడు. కాగా ఐపీఎల్ 2025 మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుండ‌గా.. 18 సీజ‌న్ ఐపీఎల్ విజేత‌పై ఇప్ప‌టి నుంచే ఆయా టీంల అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అండీ ఫ్ల‌వ‌ర్ సంతృప్తి

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కోచ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అండీ ఫ్ల‌వ‌ర్ (Andy Flower) మీడియాతో మాట్లాడుతూ.. రెండో ఇన్సింగ్స్ ఆడే జ‌ట్టుకు 11వ ఓవ‌ర్ త‌ర్వాత డ్యూ ఫ్యాక్ట‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వేరే బంతిని తీసుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం ఆహ్వానించ‌ద‌గిన విష‌య‌మే అన్నాడు. ఎందుకంటే మంచు ప్ర‌భావం తో బౌలింగ్ ప‌డ‌టం లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఐపీఎల్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యం ఇరు జ‌ట్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విశ్వ‌సిస్తున్నాను అని ప్రకటించాడు. గేమ్ లో ఇలాంటి మార్పులు చేయ‌డం కూడా మంచిదే అని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

Leave a Comment