Players From IPL to Indian Team: ఈసారి ఎవ‌రినీ అదృష్టం వ‌రించ‌నుందో..!

Players From IPL to Indian Team : ఐపీఎల్లో చాన్స్ దొర‌క‌డం చాలా మందికి అదృష్టం. కొంత‌మంది క్రీడాకారులు అందులో రాణించి టీం ఇండియా త‌లుపుతడుతున్నారు. గ‌తంలో రంజీల్లో బాగా ఆడిన వారికే చాన్సులు వ‌చ్చేవి. ఇప్పుడు ఐపీఎల్ లో రాణిస్తేనే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అలా ఐపీఎల్లో రాణించి అవ‌కాశాలు కొట్టేసినా వాళ్లు.. బోలెడంత మంది ఉన్నారు. అందులో టీం ఇండియాకు ఆడినవారు, ప్ర‌స్తుతం ఆడుతున్న వాళ్ల గురించి తెలుసుకుందాం. అలాగే ఐపీఎల్ 2025 సీజ‌న్ ద్వారా ఎవ‌రికీ ల‌క్ క‌లిసొచ్చి టీం ఇండియాకు ఎంపిక‌వుతారో మ‌రీ.

Players From IPL to Indian Team :ఐపీఎల్ ఆడటంతోనే..!

రాహుల్ చాహర్, దీపక్ చాహర్, నటరాజన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్, రాహుల్, మనీశ్ పాండే, మనోజ్ తివారీ, నితీశ్ రాణా, హర్షిత్ రాణా, యుజ్వేంద్ర చాహల్, శిఖర్ దావన్, రింకూ సింగ్, కుల్దీప్ సేన్, నితీశ్ కుమార్ రెడ్డి  ఇలా ఎంతో మంది తమ లక్ ను పరీక్షించుకుని విజయం సాధించారు. ఇందులో కొన్ని సంవత్సరాల పాటు టీం ఇండియా క్రికెట్ కు సేవలందించినవారు ఉన్నారు. చాలా మంది ఒక్కో సిరీస్ తర్వాత టీంలో చాన్సులు కోల్పోయిన వారు ఉన్నారు. అయితే IPL అనేది షార్ట్ కట్ లో టీం ఇండియా క్రికెట్ టీంలోకి  ఎంట్రీ కావడానికి ఉన్న ఏకైక అవకాశం. 

Players From IPL to Indian Team natarajan

Natarajan యార్కర్ కింగ్ 

IPL అనేది 2008 నుంచి ప్రారంభ‌మైంది. మొద‌టి సీజ‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది భార‌త క్రికెట‌ర్లు వెలుగులోకి వ‌చ్చారు. అందులో బౌల‌ర్లు, బ్యాట‌ర్లు వికెట్ కీప‌ర్లు ఇలా ఎంతో మంది ఉన్నారు. అస‌లేమాత్రం డ‌బ్బు లేని కేవ‌లం టాలెంట్ తోనే పైకి వ‌చ్చిన వాళ్ల‌లో టి. న‌ట‌రాజ‌న్ అని చెప్పొచ్చు.. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీంలో న‌ట‌రాజ‌న్ గొప్ప బౌల‌ర్ గా రూపాంతరం చెందారు. న‌ట‌రాజన్ యార్కర్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కీల‌క‌మైన డెత్ ఓవ‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ వేసే బౌలింగ్ తో స‌న్ రైజ‌ర్స్ చాలా మ్యాచ్ లు గట్టెక్కింది. అలాంటి న‌ట‌రాజ‌న్ ఒక సీజ‌న్ లో బాగా రాణించి టీం ఇండియా జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్, వ‌న్డే సిరీస్ ఆడాడు.

Players From IPL to Indian Team Umran malik

Umran Malik : 150 kmph స్పీడ్ తో

Umaran malik కూడా సన్ రైజర్స్ కు ఆడిన తర్వాతే టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కి.మీ వేగంతో బంతులు వేయగలడు. ఇలా ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ లో  తన టాలెంట్ నిరూపించుకుని టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 

Also read : https://t20timepass.com/all-eyes-on-rishabh-pant-and-shreyas-iyer/

ipl players in indian team deepak chahar, rahul chahar

రాహుల్ చాహర్, దీపక్ చాహర్ బ్రదర్స్ 

Deepak Chahar చెన్నై సూపర్ కింగ్స్ కు, Rahul Chahar పంజాబ్ కింగ్స్ తో పాటు ఇతర టీంలకు ఆడాడు. దీంతో వీరిద్దరూ టీం ఇండియా క్రికెట్ టీంలో వివిధ సమయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇలా తమ టాలెంట్ తో టీంలోకి అడుగుపెట్టారు. ఫాస్ట్ బౌలర్ గా దీపక్ చాహర్, స్పిన్ బౌలింగ్ విభాగంలో రాహుల్ చాహర్ జట్టులో అడుగుపెట్టారు.

Nitish Kumar reddy సెంచరీతో..

2024 ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్ లో మెరిసిన nitish Kumar Reddy, బౌలింగ్ లో హర్షిత్ రాణా ఇద్దరు  రాణించారు. వీరిద్దరికి గోల్డెన్ చాన్స్ లభించింది. దీంతో వీరిద్దరూ టీం ఇండియా కు ఎంట్రీ ఇచ్చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ లో సెంచరీతో అదరగొడితే హర్షిత్ రాణా బౌలింగ్ లో రాణించాడు.

Leave a Comment