Virat Kohli: ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో రెండు విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓపెనింగ్ ప్రోగ్రాంలో షారూక్ ఖాన్ డ్యాన్స్ తో అలరించాడు. విరాట్ కొహ్లీని, రింకూ సింగ్ (Rinku Singh)ను పిలిచి మరీ వారితో స్టెప్పులు వేయించాడు. అయితే డ్యాన్స్ కంటే ఎక్కువగా రెండు విషయాలు వైరల్ అయ్యాయి. విరాట్ కొహ్లీ రింకూ సింగ్ కు షేక్ హ్యాండ్ ఇస్తుండగా రింకూ చూసీ చూడనట్లు పక్కకు వెళ్లిపోవడం, మళ్లీ షారూక్ ఖాన్ రింకూ సింగ్ ను డ్యాన్స్ చేయమని చెప్పినపుడు తన చేతిలో ఉన్న మైక్ ను విరాట్ కు ఇవ్వడం. దీంతో కింగ్ కొహ్లీ షారూక్ మైక్, విరాట్ మైక్, రింకూ మైక్ పట్టుకుని నిలుచుండి పోయాడు.

సోషల్ మీడియాలో రింకూ సింగ్ పై ఫైర్
ప్రారంభ వేడుకలో (IPL opening ceremony) విరాట్ కొహ్లీకి రింకూ సింగ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై కింగ్ కొహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పెద్దలు అంటే గౌరవం ఉండాలని కింగ్ కొహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తే కనీసం పట్టించుకోవా అంటూ తిట్టి పోస్తున్నారు. కొందరు రింకూ చూసుకోవాలని కదా అక్కడ ఉంది కింగ్ కొహ్లీ అంటూ హెచ్చరిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి కొందరైతే ఆటలో చూపించు ఆటిట్యూడ్ ఇక్కడ కాదంటూ గరం అవుతున్నారు. ఇలా రింకూ సింగ్ పై విమర్శల జడివాన కురుస్తోంది.
విరాట్ తో స్టెప్పులేయించిన షారూక్ ఖాన్
కింగ్ కొహ్లీతో బాలీవుడ్ బాద్ షా (Shah Rukh Khan) షారూక్ ఖాన్ స్టెప్పులు వేయించాడు. అంతకుముందు శ్రేయ గోషాల్ (Shreya Ghoshal), ఫర్ఫామెన్స్ ఆకట్టుకుంది. చివరకు రింకూ సింగ్ తో కూడా షారూక్ స్టెప్పులు వేయించాడు. అయితే రింకూ సింగ్ స్టెప్పులు వేసే ముందు మళ్లీ మైక్ ను విరాట్ కొహ్లీకి ఇవ్వడం మళ్లీ అభిమానులకు మంట రేపింది. రింకూ సింగ్ నీకు బాగా ఎక్కువైంది. ఇవే తగ్గించుకుంటే మంచిదని నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు.