MS DHONI ఆ విష‌యంలో నెంబ‌ర్ వ‌న్ మహేంద్ర దోనినే

MS DHONI ఐపీఎల్ 18వ సీజ‌న్ 2025 ప్రారంభం అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో బ్యాటింగ్, బౌలింగ్ గురించి అంద‌రూ చ‌ర్చిస్తుంటారు. కానీ వికెట్ కీపింగ్ గురించి ప‌ట్టించుకోరు. వికెట్ కీప‌ర్లు కూడా స్టంపింగ్, క్యాచ్ ల‌తో కొన్ని మ్యాచ్ ల నిర్ణ‌యాల‌నే మార్చేస్తుంటారు. 18 సీజ‌న్ల‌లో క‌లిపి ఇండియ‌న్ వికెట్ కీప‌ర్లే ఎక్కువ క్యాచులు స్టంపింగ్ లు చేశారు. అన్ని సీజ‌న్ ల‌లో క‌లిపి వికెట్ కీపింగ్ లో అత్య‌ధిక క్యాచులు, స్టంపింగ్ లు చేసి టాప్ 5 లో ఉన్న ఆ క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసుకుందాం..

అయిదో స్థానంలో రాబిన్ ఉతప్ప

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున వికెట్ కీపింగ్ చేసిన రాబిన్ ఉత‌ప్ప 114 మ్యాచుల‌కు 90 క్యాచులు, స్టంపింగ్ ల‌తో అయిదో స్థానంలో ఉన్నాడు. రాబిన్ ఉతప్ప వేరే ఫ్రాంచైజీల‌కు ఆడిన స‌మ‌యంలో మాత్రం వికెట్ కీపింగ్ చేయ‌లేదు.

నాలుగో రిష‌బ్ పంత్

దూకుడు క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ మ‌రో అయిదు క్యాచులు ప‌డితే 100 క్ల‌బ్ లో చేరతాడు. ఈ సీజ‌న్ లో 14 మ్యాచుల్లో నాలుగు క్యాచులు ప‌ట్టడం ఈజీనే కాబ‌ట్టి పంత్ వంద క్యాచ్ ల క్ల‌బ్ లో చేర‌తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వికెట్ కీపింగ్ చేసి 96 మందిని ఔట్ చేశాడు.

వృద్ధిమాన్ సాహా మూడో స్థానంలో..

భార‌త మాజీ క్రికెట‌ర్ వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహా 140 మ్యాచుల్లో 114 డిస్మ‌సల్స్ చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఐపీఎల్ కు ముందే త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

దినేశ్ కార్తీక్ రెండో ప్లేస్ లో..

వెట‌ర‌న్ ప్లేయ‌ర్ దినేశ్ కార్తీక్ 174 మ్యాచుల్లో 150 క్యాచుల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. దినేశ్ కార్తీక్ 18 వ సీజ‌న్ కు మాత్రం రాయ‌ల్స్ చాలెంజ‌ర్ బెంగ‌ళూరుకు స‌హాయ‌ కోచ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ సీజ‌న్ లో అయినా బెంగ‌ళూరు కు క‌ప్ అందిస్తాడో లేడో చూడాలి.

నెంబ‌ర్ వ‌న్ దోనినే..

అంద‌రికీ ఇష్ట‌మైన వ్య‌క్తి మెరుపు వేగంతో స్టంపింగ్ చేసే వెట‌ర‌న్ ప్లేయ‌ర్ మ‌హేంద్ర సింగ్ దోనినే టాప్ వికెట్ కీప‌ర్ గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో ఎక్కువ క్యాచులు, స్టంపింగ్ లు చేసింది దోనినే.. క్యాచులు, స్టంపింగ్ ల‌తో 190 మందిని ఔట్ చేశాడు. మొత్తం 257 మ్యాచుల్లో దోని ఈ ఫీట్ సాధించి అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Leave a Comment