Sunil Narine Hit wicket Issue : IPL-2025 RCB శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్ లో KKR మీద నిఖార్సైన విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ విషయంపై అందరి ఫోకస్ పడింది. అదే నరైన్ హిట్ వికెట్. సెల్ఫ్ అవుట్ గా పరిగణించాల్సిన హిట్ వికెట్ ను ఎందుకు పరిగణించలేదు.. అంపైర్లు ఈ విషయంలో సాదాసీదాగా ఎందుకు వ్యవహరించారనేది హాట్ టాపిక్ అయింది. అయితే దీని గురించి వాస్తవమేంటో తెలుసుకుందాం.
MCC Law Hit wicket issue గురించి ఏం చెబుతోంది..
KKR టీం బ్యాటింగ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సునీల్ నరైన్ అనుకోకుండా తన బ్యాటును స్టంప్‌లకు తాకించాడు. దీంతో బెయిల్స్ కింద పడ్డాయి. ఇక ఆర్సీబీ ఫీల్డర్లు కాస్త ఆసక్తిగా అవుటేమో అన్నట్లు చూశారు. కానీ అంపైర్లు మాత్రం నరైన్‌ను హిట్ వికెట్‌గా పరిగణించలేదు. అసలేం జరిగిందంటే.. ఆ బాల్ వైడ్ వెళ్లింది. ఇక RCB వికెట్ కీపర్ జితేష్ శర్మ బాల్ అందుకున్నాడు. అప్పటికే Narine కూడా బ్యాటింగ్ రిలేటెడ్ యాక్షన్ పూర్తి చేశాడు. దాని అర్థం బ్యాటర్ తన డెలివరీ పూర్తి చేశాడు. ఈ సందర్భంలో షాట్ ఆడడం పూర్తి చేశాడని అర్థం. ఈ ఉదంతంలో షాట్ ఆడిన తర్వాత బ్యాట్ స్టంప్స్ తాకింది. సో దీన్ని అవుట్ గా పరిగణించడం జరగదు. తాకితే అది ఔట్ హిట్ వికెట్‌గా పరిగణించబడదు. దీనికి సంబంధించి మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ లా ప్రకారం.. ఓ క్లాజ్ ఉంది. (MCC LAW) ఎంసీసీ లా 35.2 ప్రకారం.. బ్యాటర్ (స్ట్రైకర్ ) బాల్ ను హిట్ చేసే క్రమంలో కానీ.. రన్ తీయడానికి రెడీ అవుతున్నప్పుడు కానీ అనుకోకుండా బ్యాట్ లేదా బాడీ ద్వారా స్టంప్స్ ను తాకడంతో బెయిల్స్ పడ్డప్పుడు అవుట్ గా పరిగణిస్తారు. మిగతా సమయాల్లో హిట్ వికెట్ గా పరిగణంచలేరు. మరో విషయం ఏంటంటే.. బాల్ వికెట్ కీపర్ అయిన జితేష్ అందుకున్నాక Narine బ్యాట్ స్టంప్స్ తాకింది. ఇక్కడ అంపైర్లకు పూర్తిగా క్లారిటీ ఉంది. పూర్తిగా బాల్ డెడ్ అయ్యాక నరైన్ బ్యాట్ వికెట్లను తాకిందని తేలడంతో వాళ్లు సాదాసీదాగా వ్యవహరించారు. ఎలాంటి రివ్యూలు కూడా కోరలేదు. MCC LAW అనేది క్రికెట్ నిబంధనలను తెలిపే చట్టం.
అలవోకగా RCB
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన KKR నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది. సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిగతావాళ్లు తుస్సుమనిపించడంతో ఈజీగా రెండొందలు దాటాల్సిన స్కోరు కేవలం 174కే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా 3 కీలక వికెట్లు తీశాడు. ఛేదనలో ఆర్సీబీ ఓపెనింగ్ పెయిర్ గా ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56), విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్) దడదడలాడించారు. కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34), లివింగ్‌స్టోన్ (5 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడడంతో అలవోకగా RCB విజయాన్ని అందుకుంది.