Who started Dil Scoop దిల్ స్కూప్ షాట్ మొదట ఆడింది ఎవరంటే

Who started Dil Scoop క్రికెట్ లో వినూత్న‌మైన షాట్ల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. చాలా మంది ప్లేయ‌ర్లు క్రికెట్ బుక్స్ లో ఉన్న షాట్లే ఆడ‌తారు. అయితే అవి లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ వేసే స‌మ‌యంలో వ‌ర్క్ అవుట్ కావు. కానీ ఎంత మంచి గుడ్ లెంగ్త్ బాల్ వేసినా కూడా.. దిల్ స్కూప్ తో బౌండ‌రీ లేదా సిక్సు కొట్టేయ‌వ‌చ్చు. దీనికి కావాల్సింది ప్రాక్టీస్. ఇలాంటి షాట్లు అంద‌రూ క్రికెట‌ర్లు ఆడ‌లేరు. కొంత‌మంది ప్ర‌త్యేక‌మైన స్కిల్స్ ఉన్న వారు మాత్ర‌మే ఇలాంటి షాట్లు ఆడ‌గ‌ల‌రు. అందులో ముఖ్యంగా 360 డిగ్రీ ప్లేయ‌ర్లు ఈజీగా కొట్టగలరు.

Dil Scoop తిలకరత్నే దిల్షాన్..

శ్రీలంక క్రికెట‌ర్ తిల‌క‌ర‌త్నే దిల్షాన్ (Tillakaratne Dilshan) ఆస్ట్రేలియా టూర్ లో మొద‌ట దిల్ స్కూల్ షాట్ ను ప్ర‌వేశ‌పెట్టాడు. మిచెల్ స్టార్క్ చాలా వేగంగా బంతులేస్తున్నాడు. ఇక ఎటు పాలుపోని ప‌రిస్థితిలో షాట్లు ఆడ‌టం మొద‌లెట్టారు. అది మామూలుగా కాదు. 140 కిలోమీట‌ర్ల వేగంతో వ‌స్తున్న బంతిని కిందికి వంగి త‌ల కింద‌కు వంచి బ్యాట్ తో త‌ల వెన‌క పైనుంచి ప్లిక్ చేయ‌డం.. ఇది మామూలుగా అయితే సాధ్య‌ప‌డ‌దు. ఎన్నో రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిన బ్యాట్స్ మెన్ అయితేనే సాధ్య‌మ‌వుతుంది. ఇలా దిల్షాన్ వ‌రుస‌గా సిక్సులు, ఫోర్ల‌తో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను విసిగెత్తించాడు. ఈ వినూత్న షాట్ కొట్టిన స‌మ‌యంలో కామెంట‌రీ బాక్సులో ఉన్న సునీల్ గ‌వాస్క‌ర్ దీనికి దిల్ స్కూప్ అని పేరు పెట్టేశాడు. అప్ప‌టి నుంచి వెన‌క్కి ఎవ‌రూ షాట్లు ఆడిన దిల్ స్కూప్ అని పిల‌వ‌డం అల‌వాటు అయిపోయింది. ఒక‌ప్పుడు వ‌న్డే క్రికెట్ లోనే ఇలాంటి షాట్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం చాలా అరుదు. ఇప్పుడు క్రికెట్ మొత్తం టీ 20 మాయ‌లో ప‌డిపోయింది. మూడు గంట‌ల్లో మ్యాచులు అయిపోతున్నాయి. వీలైనంత మేర సిక్సులు, ఫోర్లు కొడితేనే మ్యాచులు చూసేందుకు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డుతున్నారు. ఇప్పుడు టీ 20 క్రికెట్ లో ఇది ఈజీ అయిపోయింది.

Who started Dil Scoop 360 డిగ్రీ ప్లేయ‌ర్లు…

సౌతాఫ్రికా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డివిలియ‌ర్స్ గ్రౌండ్ లో న‌లుమూల‌ల షాట్లు ఆడ‌గ‌ల‌డు. అంత‌టి టాలెంట్ ఉన్న క్రికెట‌ర్ డివిలియర్స్.. వికెట్ కీప‌ర్ వెన‌కాల షాట్లు కొట్ట‌డంలో దిట్ట‌.. బంతి వేగం 140 పైగా వ‌చ్చిందంటే చాలు కీల‌క సమ‌యాల్లో వెన‌క్కి కొట్టేయ‌డంలో డివిల‌య‌ర్స్ ది ప్ర‌త్యేకమైన శైలి. ఇప్పుడు ఇండియా క్రికెట‌ర్ల‌లో సూర్య కుమార్ యాద‌వ్ ది (Suryakumar Yadav ) ప్ర‌త్యేక స్థానం.. స్పీడ్ బౌలింగ్ లో థ‌ర్డ్ మ్యాన్, ఫైన్ లెగ్, వికెట్ కీప‌ర్ వెన‌కాల‌కు సిక్సులు కొడుతూ.. బౌల‌ర్ల‌పై ఆదిపత్యం చెలాయిస్తున్నారు. ప్రస్తుత జ‌న‌రేష‌న్ లో ఉన్న ప్లేయ‌ర్ల‌లో సూర్య కుమార్ యాద‌వ్ ఎక్కువగా ఇలాంటి షాట్లు ఆడుతున్నారు.

ఈ షాట్ల‌కు అస‌లైన రూప‌క‌ర్త జింబాబ్వే క్రికెట‌ర్..

జింబాబ్వే క్రికెటర్ డాగ్లస్ మార్లియర్ (Dogli Marlier) దిల్ స్కూప్ షాట్లు మొదలు పెట్టాడు అని చెప్పొచ్చు. 2002 మార్చి 7న ఫరీదాబాద్ లో జరిగిన వన్డే మ్యాచులో టీం ఇండియా బౌలర్ జహీర్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా వికెట్ కీపర్ వెనక్కి సిక్సులు, ఫోర్ల మోత మోగించాడు. దీంతో ఈ మ్యాచులో మార్లియర్ చేసిన విధ్వంసంతో టీం ఇండియా తలవంచక తప్పలేదు. అయితే మ్యాచ్ ఆడే సమయంలో మార్లియర్ ఆడిన గేమ్ కు అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటికీ క్రికెట్ లో ఎలాంటి టీ 20 గేమ్స్ లేవు. కేవలం ఆడేది వన్డే, టెస్ట్ మ్యాచులు మాత్రమే. కాస్తో కూస్తో స్పీడ్ గా ఆడే క్రికెటర్లు అంటే సచిన్, సెహ్వాగ్, శ్రీలంక నుంచి సనత్ జయసూర్య, న్యూజిలాండ్ బ్రెండన్ మెక్ కల్లమ్, ఆస్ట్రేలియా నుంచి అడమ్ గిల్ క్రిస్ట్.. కానీ జింబాబ్వే నుంచి డాగ్లస్ మార్లియర్ ఇన్సింగ్స్ చూసిన తర్వాత చాలా మంది క్రికెటర్లు ఇలాంటి షాట్లు ఆడటానికి ట్రై చేశారు. కానీ వారి వల్ల కాలేదు. ఇలాంటి షాట్లు ఆడాలంటే రిస్క్ చేయాలి. వికెట్ పడే అవకాశాలే ఎక్కువ. అలాంటి సమయంలో వికెట్ ను కాపాడుకుంటూ మార్లియర్ ఇండియాపై ఛేజ్ చేసిన విధానం సగటు క్రికెట్ అభిమానిని ఎంతో ఆకట్టుకుంటుంది. జింబాబ్వే క్రికెటర్ డాగ్లస్ మార్లియర్ ఆ దేశం తరఫున 48 వన్డేలు, అయిదు టెస్టు మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో ఒక సెంచరీ, మూడు హాప్ సెంచరీలు చేశాడు.

జహీర్ ఖానే ఆశ్చర్యపోయేలా షాట్లు ఆడి..

ఈ విషయాన్ని ఇండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారీలు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చర్చించారు. టీ 20 క్రిెకెట్ లో వేగంగా పరుగులు చేస్తారు. కానీ ఎవరికైనా తెలుసా డాగ్లి మర్లియర్ అనే ఒక జింబాబ్వే క్రికెటర్ (Zimbabwe Cricket Team) ఇండియాపై 2022లోనే స్కూప్ షాట్లలో చెలరేగాడని, దీంతో జహీర్ ఆశ్చర్యంలో మునిగి పోయి బౌలింగ్ ఎలా వేయాలో తెలియక తికమకపడిన విషయం వెల్లడించారు.

బ్యాటింగ్ లో పెరిగిన దూకుడు

2000 సంవత్సరం నుంచి క్రికెట్ లో కొత్త రకం షాట్లు ఆడటం ప్రారంభించారు. సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడుతూనే కొత్తగా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్లు వెరైటీ షాట్లు ఆడటం స్టార్ట్ చేసి బౌలర్లను ఇబ్బందులకు గురి చేసేవారు. పిచ్ ఎలాంటిదైనా వినూత్న మైన షాట్లు ఆడుతుంటే బౌలర్ల లయ దెబ్బతింటుంది. దీంతో వారు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయలేరు. దీని వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. దూకుడు క్రికెట్ కు మారుపేరైనా సెహ్వాగ్ (Virender Sehwag) సనత్ జయసూర్య (Sanath Jayasuriya) మెక్ కల్లమ్, గిల్ క్రిస్ట్, క్రిస్ గేల్ (Chris Gayle) లాంటి వాళ్లు ఇదే ఫార్ములాను ఫాలో అయి వేగంగా పరుగులు చేసి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు.దీంతో బౌలర్లు కూడా యార్కర్లు, రివర్స్ స్వింగ్ రాబట్టి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసే బంతులు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పేస్ బౌలింగ్ లో నకుల్ బాల్ డిపెరెంట్.. ఈ బంతిని బ్యాట్స్ మెన్ అంచనా వేయడం చాలా కష్టం. ఇలా బౌలర్లు కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

also read : మహిళా క్రికెటర్లలో Same Sex Marriages సంస్కృతి ఎందుకు పెరుగుతుందంటే?

Leave a Comment