Washington Sundar: వాషింగ్ట‌న్ సుంద‌ర్ పై గూగుల్ సీఈవో ట్వీట్ రిప్లై వైర‌ల్

Washington Sundar: గుజ‌రాత్ టైటాన్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ అదిరిపోయే ఆట‌తో స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌పై ఎటాకింగ్ కు దిగాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 29 బంతుల్లో 49 ప‌రుగులు చేసి బౌలింగ్ పిచ్ పై దూకుడుగా ఆడి గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) విజ‌యంలో కీల‌క రోల్ పోషించాడు. అయితే గ‌తంలో ఓ నెటిజ‌న్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ గురించి చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. అందులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ టీం ఇండియా జ‌ట్టులో ఎంతో కీల‌క ఆట‌గాడు. కానీ ఐపీఎల్ కు వ‌చ్చే స‌రికి అత‌డికి చాన్సు లు రావ‌డం లేదు. చాలా ప‌రిమితంగా ఇస్తున్నారు అని ట్వీట్ చేశాడు. దీనికి గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)కూడా స్పందించారు. అవును చాలా వాషింగ్ట‌న్ కు చాలా ప‌రిమితంగా చాన్స్ లు ఇస్తున్నారని రిప్లై ఇచ్చారు. మార్చి 25, 2025 న వచ్చిన ట్వీట్ కు సమాధానంగా వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే ఆటతో ఐపీఎల్ లో తనని కొని చాన్స్ లు ఇవ్వని వారికి బ్యాట్ తో సమాధానం చెప్పేశాడు.

వాషింగ్టన్ సుందర్ ఫైర్

అయితే గ‌త రాత్రి ఆడిన మ్యాచులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ చెల‌రేగి ఆడాడు. సిక్సులు, ఫోర్ల‌తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) వైపు ఉన్న మ్యాచ్ ను కాస్త గుజ‌రాత్ వైపు తిప్పేశాడు. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ త‌న అపిషీయ‌ల్ ట్వీట్ లో సుంద‌ర్ వ‌చ్చాడు. సుంద‌ర్ విజ‌యం సాధించాడు అని రాసుకొచ్చింది. అది కూడా సుంద‌ర్ పిచాయ్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చింది. దీంతో ప్ర‌స్తుతం నెటిజ‌న్లు ఖుషీ అయిపోతున్నారు.

బెంచ్ కే పరిమితం.. చాన్సులు కరవు

వాషింగ్ట‌న్ సుంద‌ర్ (Washington Sundar) గ‌త ఏడెనిమిదేళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. గ‌త సీజ‌న్ వ‌ర‌కు స‌న్ రైజ‌ర్స్ త‌ర‌ఫున ఆల్ రౌండ‌ర్ గా ఆడాడు. కానీ స‌న్ రైజర్స్ 14 మ్యాచుల్లో అత‌డికి ఒక‌టి రెండు మ్యాచుల‌కే ప‌రిమితం చేసింది. 2023, 24 సీజ‌న్ లో చాన్సులు రాక‌పోవ‌డంతో బెంచ్ కే ప‌రిమితం అయ్యాడు. ఒక టీం ఇండియా క్రికెటర్ ను ఎక్కువ‌గా బెంచ్ కు ప‌రిమితం చేసిన వారిలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఒక్క‌డే అని చెప్పొచ్చు. అంత‌కు ముందు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడిన స‌మ‌యంలో 2020-21 సీజ‌న్ లో కేవలం తొమ్మిది మ్యాచులు ఆడాడు. ఇదే వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఎక్కువ మ్యాచులు ఆడిన సంద‌ర్భం అని చెప్పొచ్చు.

అవకాశం రాకపోతే నిరూపించుకునేదెలా..

టీం ఇండియా క్రికెట‌ర్ అందులో బ్యాటింగ్, బౌలింగ్ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. అయినా ఫ్రాంచైజీలు వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను (Washington Sundar)స‌రిగా వినియోగించుకోలేద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఒక గూగుల్ సీఈవో కూడా ఈ విష‌యాన్ని క‌నిపెట్టినా.. సామాన్య క్రికెట్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నా.. ఐపీఎల్ లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను తీసుకున్న టీంల‌కు ఎందుకు అర్థం కావ‌డం లేదో అనే చ‌ర్చ సాగుతుంది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ మ‌ల్టీ టాలెంటెడ్ ప్లేయ‌ర్.. కానీ అవ‌కాశం ఇస్తే క‌దా.. ఆడ‌తాదో లేదో తెలిసేది. కొంత‌మందికి సీజ‌న్ ల‌కు సీజ‌న్లు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. వాషింగ్ట‌న్ సుంద‌ర్ కు అవ‌కాశం వ‌స్తే క‌చ్చితంగా నిరూపించుకునే సత్తా ఉన్న క్రికెటర్ అని చెప్ప‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు.

Leave a Comment