who has scored the most runouts in the IPL : ఐపీఎల్ లో అత్యధిక రనౌట్లు చేసింది ఎవరో తెలుసా

most runouts : ఐపీఎల్ అనగానే అందరూ సిక్సులు, ఫోర్లు కొట్టడం అనుకుంటారు. ముఖ్యంలో టీ 20 మ్యాచుల్లో బ్యాటర్ల ఆదిపత్యం కనిపిస్తుంది. బౌలర్లకు వికెట్లు దక్కని సమయంలో ఫీల్డర్ల పాత్ర చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. రన్స్ రాని సమయంలో చురుగ్గా ఫీల్డింగ్ చేసి రనౌట్లు చేయడం (Most Runouts) ఫోర్లు వెళ్లకుండా ఆపడం, క్యాచులు సరిగా తీసుకోవడం కూడా మ్యాచ్ విజయంపై ఆధారపడి ఉంటుంది.

జడ్డూ వైపు వెళితే ఇక అంతే

ఐపీఎల్ 18వ సీజన్ నడుస్తుంది. ఐపీఎల్ 2025 లో ఏప్రిల్ 7 వరకు జరిగిన అన్ని మ్యాచుల్లో కలిసి సర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 23 మందిని రన్ అవుట్ చేశాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లో కూడా చురుగ్గా కదులుతాడు. ఎక్కువగా డైవ్ లు చేస్తూ, బ్యాటర్ కొట్టిన బంతి ఫోర్ వెళ్లకుండా ఆపతాడు. దీంతో పాటు జడ్డూ వైపు బంతి వెళ్లిందంటే సింగిల్ తీయాలన్న కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 23 రనౌట్లు చేసి టాప్ 2 స్థానంలో ఉన్నాడు. దాదాపు 18 సీజన్ లలో ఎప్పుడూ ఎవరినో ఒకరిని రనౌట్ చేస్తూనే ఉంటాడు.

తర్వాతి స్థానంలో కింగ్ కొహ్లీ..

ఆ తర్వాత స్థానంలో టాప్ 3లో కింగ్ విరాట్ కొహ్లీ (Virat Kohli) ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని మ్యాచుల్లో కలిపి విరాట్ 22 మందిని రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేర్చాడు. మనీశ్ పాండే (Manish Pandey)16, సురేశ్ రైనా 16 మంది బ్యాట్స్ మెన్స్ ను రనౌట్ చేసి నాలుగో స్థానాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పటికే సురేశ్ రైనా రిటైర్ అవ్వగా.. మనీశ్ పాండేకు చాలా తక్కువ చాన్సులు వస్తున్నాయి.

who has scored the most runouts in the IPL : దోనికి తిరుగుందా

MS DHONI
MS DHONI

ఇక మొదటి స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర దోని (MS Dhoni) ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా మొత్తం 25 మందిని రనౌట్ చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దోని అంటే వేగంగా పరుగెత్తగల చిరుత లాంటి వ్యక్తి. అందుకే ఈ భారత క్రికెటర్ల అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.

Leave a Comment