Stephen Fleming: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో కదం తొక్కగా.. కేవలం క్యాచ్ లు డ్రాప్ చేయడం వల్లే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు.
వికెట్లు పడుతున్నా.. హిట్టింగ్ ఆపలే
మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 86 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ గా వచ్చిన ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) మాత్రం ఎక్కడా తగ్గలేదు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ దంచేశాడు. ఐపీఎల్ లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య ఆడిన తీరు ఎంతో ఆకట్టుకుంది. అయితే ప్రియాంశ్ ఆర్య క్యాచులు కూడా డ్రాప్ కావడం విశేషం. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో స్ట్రైట్ లో గట్టిగా కొట్టిన ప్రియాంశ్ 6 పరుగుల వద్దే అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. బుల్లెట్ స్పీడ్ లో వచ్చిన బంతిని ఖలీల్ ట్రూ చేసినా అందుకోలేకపోయాడు. ముఖేశ్ చౌదరి కూడా ప్రియాంశ్ ఆర్య క్యాచ్ ను వదిలేశాడు. 73పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచు అందుకున్నా.. బౌండరీ రోప్ ను తాకాడు. దీంతో సిక్సు ఇచ్చేశారు.
శశాంక్ ఇచ్చిన క్యాచ్ జారవిడిచి
శశాంక్ సింగ్ (Shashank Singh) ఇచ్చిన క్యాచును కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్ రచిన్ రవీంద్ర వదిలేశాడు. 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు శశాంక్ సింగ్ క్యాచ్ ఇవ్వగా దాన్ని వదిలేయడంతో శశాంక్ తన ఇన్సింగ్స్ ను 52 పరుగుల వద్ద ముగించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ మొదటి ఇన్సింగ్స్ లో 219 పరుగులు చేయగలిగింది. ఇవే క్యాచులు అందుకుని ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈజీగా మ్యాచ్ గెలిచేది.
Stephen Fleming బ్యాటింగ్ లో తేలిపోతున్న చెన్నై
చెన్నై బ్యాటింగ్ లో మునుపటి వాడి తగ్గింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే ఇద్దరు బాగానే ఆడుతున్నా.. వేగం అందుకోలేకపోతున్నారు. దీనికి తోడు వన్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్ తన ఫామ్ కోల్పోయాడు. రుతురాజ్ గైక్వాడ్ తన సీజన్ లతో చెలరేగి ఆడాడు. ఈ సారి కెప్టెన్ గా ఎంపికయ్యే సరికి రుతురాజ్ తన ఫామ్ కోల్పోయి స్వల్ప స్కోరుకే అవుట్ అవుతున్నాడు. ఇటు విజయ్ శంకర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దోని, జడేజా బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయారు. ఛేజింగ్ తడబడుతున్నారు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో తడబడుతున్న చెన్నై ఆడిన అయిదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయింది. ఇక నుంచి దోని తన మార్కును చూపిస్తే తప్పా చెన్నై గెలవడం కష్టం.. చెన్నై ఇప్పటికే అయిదు సీజన్లలో టైటిల్ కొట్టిన జట్టని.. ఒక్కసారి ఫామ్ అందుకుంటే తగ్గేది లేదని చెప్పేందుకు సిద్ధం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.