What happened to Chennai Super Kings చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఏమైంది

What happened to Chennai Super Kings చెన్నై సూపర్ కింగ్స్ టీం (Chennai Super Kings) అయిదు సార్లు ఐపీఎల్ చాంపియ‌న్స్. 18 టోర్న‌మెంట్ల‌లో దాదాపు 5 సార్లు టైటిల్ కొట్టింది. మ‌రో మూడు సార్లు ఫైన‌ల్లో ఓడిపోయింది. ఇక ఫ్లే ఆప్స్ కు కూడా ఎక్కువ సార్లే వ‌చ్చింది. అలాంటి చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 18 వ సీజ‌న్ లో తేలిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్క దాంట్లోనే గెలిచింది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇందులో బ్యాటింగ్ లేమి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ర‌చిన్ ర‌వీంద్ర మిన‌హా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు మ్యాచుల్లో ఒక్కరు కూడా హాప్ సెంచ‌రీ చేయ‌లేక‌పోయారు. అస‌లు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టేనా మ్యాచ్ ఆడుతోంది అనే అనుమానాలు క‌లిగిస్తున్నాయి.

ఒక‌ప్ప‌టి ఓపెనింగ్ దూకుడేది..

చెన్నై సూప‌ర్ కింగ్స్ కు గతంలో ఉండే ఓపెనింగ్ భాగ‌స్వామ్యాలే కీల‌కం.. బ్రెండెన్ మెక్ క‌ల్ల‌మ్, మ్యాథ్యూ హెడెన్ (Matthew Hayden), వెస్టిండీస్ కు చెందిన స్మిత్, ముర‌ళీ విజ‌య్ (Murali Vijay) ఫాప్ డుప్లెసిస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఓపెన‌ర్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ కు అదిరిపోయే ఆరంభాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ దూకుడు క‌నిపించ‌డం లేదు. ఓపెనర్ల పార్ట్ న‌ర్ షిప్ అస్స‌లు బాగుండ‌టం లేదు. ఆడిన నాలుగు మ్యాచుల్లో కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, డేవాన్ కాన్వే, తుస్సుమ‌నిపించారు. మ‌రో ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర రెండు మ్యాచుల్లో బాగా ఆడినా మ‌రో రెండు మ్యాచుల్లో తేలిపోయాడు. వ‌న్ డౌన్ బ్యాట్స్ మెన్ కొర‌త కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త టీంలో సురేశ్ రైనా, షేన్ వాట్సాన్, లాంటి భీక‌ర‌మైన బ్యాట్స్ మెన్ లు ఉండేవారు. వీరితో పాటు అజింక్య ర‌హ‌నే , అంబ‌టి రాయుడు అద‌ర‌గొట్టేవారు.

What happened to Chennai Super Kings దోని ఫామ్ లేమి.. మిడిలార్డ‌ర్ ఘోర వైఫ‌ల్యం

మ‌హేంద్ర దోని (Mahendra Dhoni) ఫామ్ లేమితో బాధ‌ప‌డుతున్నాడు. వేగంగా ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాడు. దీంతో పాటు శివ‌మ్ దూబె, దీప‌క్ హుడా, విజ‌య్ శంక‌ర్ ఇలా ఎవ‌రూ కూడా రాణించ‌లేక‌పోతున్నారు. 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఢిల్లీ టీం చెపాక్ స్టేడియంలో (Chepauk Stadium) చెన్నైను ఓడించింది. ఆర్సీబీ టీం అయితే ఏకంగా ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ లో గెలిచింది అంటే ఇప్పుడు మ‌ళ్లీ చెపాక్ లో గెలిచింది. ఈ రికార్డులు చూస్తే అర్థ‌మవుతుంది.. చెన్నై సూప‌ర్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో ఎంత‌లా డామినేట్ చేసిందో అర్థ‌మ‌వుతుంది.

బౌలింగ్ లో కూడా లోపాలెన్నో..

మ‌హీశా ప‌తిరాణా (Pathirana) రాణిస్తున్నా.. ముకేశ్ చౌద‌రి, జేమీ ఓవ‌ర్ట‌న్, సామ్ క‌ర‌న్, అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా ఫామ్ కోల్పోయారు. వికెట్లు తీయ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇలా క‌ర్ణుడి చావుకి వంద కార‌ణాలు అన్న‌ట్లు త‌యారైంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌రిస్థితి. ముఖ్యంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ కు కావాల్సింది. పాజిటివ్ ఎన‌ర్జీ, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు. అంతే కోలుకోవ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. అందులో ఇప్ప‌టికే ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం. కానీ ఎక్క‌డో తేడా కొడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ కోల్పోవ‌డం.. టీంలో కొత్త ప్లేయ‌ర్లు కుదురుకోక‌పోవ‌డం చాలా స‌మ‌స్య‌గా మారింది. ఇవ‌న్నీ అదిగ‌మిస్తే విజ‌యం సాధించ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. మ‌రో ప‌ది మ్యాచులు ఉన్న ఈ స‌మ‌యంలో దోనీ అండ్ టీం ఏం చేస్తుందో చూడాలి.

Leave a Comment