Sunrisers The Old Story Repeat Again: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమితో చతికిలపడింది. ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)ఆట మరోలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేసుకున్నారు. అదే విధంగా ఆడిన మొదటి మ్యాచులో మరోసారి 277 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరారు. అయితే అందరూ అనుకున్నట్లు నెక్ట్స్ మ్యాచ్ నుంచి మరింత దూకుడుగా ఆడతారని అనుకుంటే ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో ఏకంగా 81 పరుగుల తేడాతో ఓడిపోయి చెత్త ఓటమిని మూట గట్టుకున్నారు.
బ్యాటింగ్ లో వైఫల్యం..
ఐపీఎల్ 2025 కు ముందు అన్ని జట్లలో సన్ రైజర్స్ కూడా బలమైనదే. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ లతో దుర్బేద్యంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచులో బాగానే ఆడారు. కానీ అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఇప్పటి వరకు హెడ్, అభిషేక్ శర్మ మీద ఎక్కువగా ఆధారపడిన టీం వారిద్దరూ ఫామ్ కోల్పోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతోంది. మొదటి మ్యాచ్ లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ కూడా వరుసగా మూడు మ్యాచుల్లో తేలిపోయాడు. దీంతో టాప్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది
మిడిల్ ఆర్డర్ కూడా రాణించట్లేదు
హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)నితీశ్ కుమార్ రెడ్డిల బ్యాటింగ్ పైనే సన్ రైజర్స్ మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ ఆధారపడింది. కానీ గత సీజన్ లో మెరుపులు మెరిపించిన నితీశ్ కుమార్ రెడ్డి, ఈ సారి మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. నాలుగు మ్యాచుల్లో ఒక్క భారీ ఇన్సింగ్స్ ఆడలేదు. పోనీ ఆపద సమయాల్లో ఆదుకున్నాడా అంటే అదీ లేదు. హెన్రిచ్ క్లాసెన్ తన స్థాయికి తగిన ఇన్సింగ్స్ ఆడటం లేదు. కేవలం 30 పరుగులు మాత్రమే చేసి అవుటైపోతున్నాడు. కొత్త కుర్రాడు అనికేత్ వర్మ గత రెండు మ్యాచుల్లో తన సత్తా చాటాడు. కానీ కోల్ కతా మ్యాచులో మాత్రం తేలిపోయాడు. దీంతో వరుసగా మూడో సారి పరాజయం పాలై హ్యట్రిక్ ఓటమి మూటగట్టుకుంది.
అసలేమైంది..
గతంలో బౌలింగ్ విభాగంలో మాత్రమే బాగా ఆడే సన్ రైజర్స్ బ్యాటింగ్ విభాగంలో తేలిపోయేది. కానీ హెన్రిచ్ క్లాసెన్, హెడ్, నితీశ్, అభిషేక్ శర్మలు గతేడాది పూర్తిగా దీన్ని మార్చిపారేశారు. కానీ గతేడాది ఆడినట్లు ఆడటం లేదు. బౌలింగ్ విభాగం కూడా చాలా బలహీనంగా కనిపిస్తోంది. షమీ అనుకున్నట్లు రాణించడం లేదు. హర్షల్ పటేల్ (Harshal Patel)బౌలింగ్ పడటం లేదు. ఫ్యాట్ కమిన్స్ (Fat Cummins)ఫామ్ కోల్పోయాడు. సరైన స్పిన్నర్ లేడు. దీంతో పాటు బ్యాటింగ్ లైనప్ లో ఏదో తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవల్ కోల్పోయారు. సన్ రైజర్స్ బ్యాటర్లంతా అత్యుత్తమ ఆటతీరు, సత్తా ఉన్న ప్లేయర్లే. కానీ వారికి ఏదో మూలన వెలితి కనిపిస్తోంది. అయితే దాన్ని దాటుకుని ముందుకు సాగాలి. ఇంకా పది మ్యాచులు ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఆరు మ్యాచులు హైదరాబాద్ లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇలాంటి సందర్భంలో మిగతా మ్యాచుల్లో కూడా సత్తా చాటి ప్లేఆప్స్ కు చేరుకోవాలి.
Sunrisers The Old Story repeat Again: టాఫ్ ఆర్డర్ పై భారం
బ్యాటింగ్ భారం మొత్తం టాప్ ఆర్డర్ పైనే వేయొద్దు. మిడిలార్డర్ కూడా తమ వంతు బాధ్యత నెరవేర్చాలి. టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ నుంచి మంచి ఇన్సింగ్స్ బాకీ ఉంది. అదే విధంగా హెడ్ కూడా మునుపటి ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్ (Ishan Kishan) కూడా తన స్థాయి కి తగ్గ ఫర్మామెన్స్ చేయాలి. దీనికి ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం. దీంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే బ్యాటింగ్ బలం అని అందరికీ తెలిసిందే. ఇలా 120 పరుగులకు ఆలౌట్ కావడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఓడిపోయిన మ్యాచుల్లో బలహీనతలను గుర్తించి రాబోయే మ్యాచుల్లో పక్కా ప్లాన్ తో ముందడుగు వేయాలి. టోర్నీలో ఇంకా ఆరంభ దశలోనే ఉంది కాబట్టి పాయింట్ల పట్టికలో పదో స్థానాన్ని ఒకటో స్థానానికి తీసుకువెళ్లాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై పెట్టుకున్న నమ్మకాన్ని ఫ్యాన్స్ ఆశలను నిలబెట్టాలి.