Jasprit Bumrah: బుమ్ బుమ్ బుమ్రా రెడీ.. ముంబై టీం ఖుషీ

Jasprit Bumrah: ఆర్సీబీతో మ్యాచుకు..ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడి కేవలం 1 మ్యాచులోనే గెలిచింది. అయితే ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా వీక్ గా కనిపిస్తోంది. ఒకప్పటి పవర్ కనిపించడం లేదు. దీనికి కారణం ముంబై ఇండియన్స్ లో ప్రధాన పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లేకపోవడమే. అయితే ఇప్పుడు బుమ్రా ఆర్సీబీతో మ్యాచుకు అందుబాటులోకి రానున్నాడు. బుమ్రా కోసం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుమ్ బుమ్ బుమ్రా ఎంట్రీతో ముంబై బౌలింగ్ కచ్చితంగా మెరుగుపడనుంది.

క్లియరెన్స్ సర్టిఫికెట్..

సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ముంబై ఇండియన్స్ (Mumbai Indians Team)మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని ప్రధాన కోచ్ మహేల జయవర్దనే అన్నారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ,సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంతో బుమ్రా కు రూట్ క్లియర్ అయింది. ప్రస్తుతానికి బుమ్రా బౌలింగ్ బాగా చేస్తున్నాడు. ఇక సోమవారం జరిగే మ్యాచులో ఆడటమే అని తేలిపోయింది.తిరగబెట్టిన వెన్ను నొప్పిఈ ఏడాది జనవరి మొదటి వారంలో జరిగిన సిడ్నీ టెస్టులో జస్ ప్రీత్ బుమ్రా వెన్నులో నొప్పితో అర్థంతరంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా కూడా క్రికెట్ ఆడలేదు. ఫిట్ నెస్ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు జరిగిన చాంపియన్స్ ట్రోపీలో కూడా బుమ్రా పాల్గొనలేదు. అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఆడతాడా లేదా అనే సందేహం చాలా మందిలో నెలకొని ఉండగా.. ఈ సారి తప్పకుండా బుమ్రా ఆడతాడు అనే నమ్మకాన్ని ముంబై ఇండియన్స్ పెట్టుకుంది. అదే విధంగా బుమ్రా ఫిట్ నెస్ సాధించి ముంబై శిబిరంలో చేరాడు. దీంతో హర్దిక్ పాండ్యా (Hardik Pandya) ఖుషీ అయిపోయాడు.

Jasprit Bumrah: పేస్ బౌలింగ్ లో అనుభవ లేమి..

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఓడిపోయింది.విఘ్నేష్ పుత్తూర్, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు, బౌలింగ్‌లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు బుమ్రా రాకతో జస్ ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్‌ లతో పేస్ విభాగం స్పష్టంగా కనిపిస్తోంది. మరి వీరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజయం ఈజీగా సాధించవచ్చు. ఇంకా పది మ్యాచులు ఉన్న తరుణంలో ముంబై ఇండియన్స్ కనీసం 8 మ్యాచుల్లో అయినా గెలవాల్సిన అవసరం ఉంది.

ఇక బుమ్రా పైనే భారం

బుమ్రా ఇప్పటి వరకు కేవలం ముంబై ఇండియన్స్ కు మాత్రమే ఆడాడు. క్రికెట్‌లో ఐపీఎల్‌లో 2013లో కెరీర్ ప్రారంభించాడు. 133 మ్యాచ్‌లలో 165 వికెట్లు తీశాడు. 2023లో వెన్ను గాయం కారణంగా అతను ఐపీఎల్ సీజన్‌ను కోల్పోయాడు. మార్చి 2023లో వెన్ను శస్త్రచికిత్స చేసిన తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో ఇబ్బంది పడ్డాడు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో కోలుకుని మళ్లీ గాడిలో పడాలంటే కచ్చితంగా బుమ్రా తన స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే.

Leave a Comment