Ashish Nehra: టీం ఇండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్ర (Ashish Nehra) గుజరాత్ టీం కోచ్ గా వ్యవహరిస్తుండగా అతడు కోచింగ్ ఇస్తున్న తీరు ప్రస్తుతం వైరల్ అవుతోంది. క్రికెట్లో కోచ్ లు డ్రెస్సింగ్ రూంలో తీరిగ్గా కూర్చొని మ్యాచులు చూస్తుంటారు. గ్రౌండ్ లో మొత్తం కెప్టెన్ మాత్రమే మొత్తం చూసుకుంటాడు. ఫీల్డింగ్ సెట్ చేయాలన్న.. ఏ బౌలర్ కు బౌలింగ్ ఇవ్వాలన్న అంతా కెప్టెన్ నడిపిస్తాడు. కానీ అదంతా ఒకప్పటి మాట అని అంటున్నాడు ఆశిష్ నెహ్ర.
తన మార్కు చూపిస్తున్న నెహ్ర (Ashish Nehra)
గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ 2025 లో కోచింగ్ చేస్తున్న నెహ్ర ఎప్పటిలాగానే తన మార్కును చూపిస్తున్నాడు. ఫుట్ బాల్ కోచ్ వలే ఎప్పుడు గ్రౌండ్ బయట అటు ఇటు తిరుగుతూ .. ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్ల వద్దకు (Special Coaching Attraction)వెళుతూ వారి చెవిలో ఏదో చెబుతూనే ఉంటాడు. నెక్ట్స్ బాల్ ఇలా వేయుమను.. నెక్స్ట్ ఓవర్ ఈ బౌలర్ తో బౌలింగ్ వేయించు. ఫీల్డింగ్ అక్కడ సెట్ చేయించు ఇలా ఎన్నో ఎన్నెన్నో సలహాలు ఇస్తూనే ఉంటాడు.
ఎప్పుడూ బౌండరీ లైన్ వద్దే
బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తే చాలు.. ఇక ఆ ఫీల్డర్ చెవులు కొరకడమే ఆశిష్ నెహ్ర పని. ఇలాంటి కోచింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడలేదని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది అభిమానులు, క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ చర్చించుకుంటున్నారు. ఇక స్ట్రాటజిక్ టైం అవుట్ లో అయితే చెప్పనక్కర్లేదు. ఇంతలా ప్లాన్ లు రచిస్తూ టీంలో ఎప్పుడూ కొత్త విషయాలు చర్చిస్తూ కొత్త ప్లేయర్లకు చాన్సు లు ఇస్తూ ఇతర జట్లకు అంతుపట్టకుండా వ్యుహాలు రచిస్తున్నాడు.
వ్యుహాలు రచించడంలో దిట్ట
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఆడిన మొదటి సారే ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోవడం చాలా గొప్ప విషయం. ఈ విషయంలో అప్పటి గుజరాత్ కెప్టెన్ పాత్ర ఎంత ఉందో.. కోచ్ గా ఆశిష్ నెహ్రా పాత్ర కూడా అంతలా ఉంది. వ్యుహాలు రచించి.. కొత్త టీంను ఏకంగా టైటిల్ విజేతగా నిలిపాడు. దీంతో ఆశిష్ నెహ్ర అంటేనే అందరికీ గుర్తిండిపోయేలా చేశాడు. టీం ఇండియా తరఫున ఆశిష్ నెహ్ర 1999లో శ్రీలంకపై టెస్టు మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. జింబాబ్వేపై వన్డేల్లో 2001 సంవత్సరంలో వన్డేల్లో మొదటి మ్యాచ్ ఆడాడు. కాగా ఆశిష్ నెహ్ర 17 టెస్టు మ్యాచుల్లో 44 వికెట్లు, 120 వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో భారత్ తరఫున 27 మ్యాచుల్లో 34 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్ లో 88 మ్యాచులు ఆడిన ఆశిష్ నెహ్ర 106 వికెట్లు తీశాడు. ఆశిష్ నెహ్ర చాలా సక్సెస్ ఫుల్ బౌలర్. ఇతడికి బీసీసీఐ (BCCI) ఇచ్చే కాంట్రాక్టు 2009 లో దక్కింది. ఆశిష్ నెహ్ర 2017 సంవత్సరంలో క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.