Australia: ఆస్ట్రేలియా (Australia cricket team) క్రికెట్ టీం వరుసగా మూడు వన్డే వరల్డ్ కప్ లు గెలిచి ప్రపంచ క్రికెట్ లో తన ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. 1999, 2003, 2007, వరల్డ్ కప్ విన్నర్ లుగా నిలిచి ప్రపంచ క్రికెట్ లో పెద్దన్న పాత్రలో నిలిచారు. ఎలాంటి పిచ్ మీద అయినా.. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలాగైనా సరే గెలిచి తీరాలనే కసితో ఆడేది. అలాగే గెలిచేది. వెస్టిండీస్ నుంచి పడితే ఇటు శ్రీలంక, ఇండియా ( India) , పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఎక్కడకు వెళ్లినా ఆసీస్ క్రికెట్ టీం జైత్రయాత్ర కొనసాగింది. 2003 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా టీం మరింత బలపడింది. ఎక్కడో ఓ మ్యాచ్ ఓడిపోవడం తప్పితే రవి అస్తమించని సామ్రాజ్యం అంటే బ్రిటిషర్లు ఠక్కున ఎలా గుర్తుకు వస్తారో.. ఓటమి అంటే తెలియని జట్టులా ఆస్ట్రేలియా టీం ఒక 20 ఏళ్ల పాటు శాసించింది.
క్రికెట్ లో తన ఆదిపత్యానికి కారణం.. 1996 వరల్డ్ కప్ ఫైనల్ చేరడం, అక్కడ శ్రీలంకపై ఓడిపోవడం, 99లో పాకిస్థాన్ పై గెలిచి వరల్డ్ కప్ సాధించడం, మళ్లీ నాలుగేళ్లకు 2003లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియాపై ఘన విజయం సాధించడం, 2007లో మళ్లీ శ్రీలంకపై వరల్డ్ కప్ గెలవడం ఇలా వరుసగా ఓ పదేళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు సువర్ణాధ్యాయం నడిచింది. ఈ సమయంలోనే ఆస్ట్రేలియాలో సత్తా కలిగిన ప్లేయర్లు బయటకు వచ్చారు.
Australia Bowling specalists బౌలింగ్ లో వీళ్లే తోపులు..
గ్లెన్ మెక్ గ్రాత్ (Glenn Mecgrath) జాసన్ గెలెస్పీ, క్రాస్పోవిచ్, బ్రెట్ లీ, అండీ బికెల్ పేస్ బౌలింగ్ లో తమ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు సాధించిపెట్టారు. ఒకవేళ ఆస్ట్రేలియా బ్యాటర్లు 200 లోపు ఆలౌట్ అయ్యారంటే చాలు.. వీళ్ల బౌలింగ్ కోసమే మ్యాచ్ చూడాల్సి వచ్చేది. ఆస్ట్రేలియా టీం బౌలింగ్ ఎటాకింగ్ అలా ఉండేది మరి. ఆ తర్వాత వచ్చిన నాథన్ బ్రాకెన్, ఇయాన్ హర్వీ, ఇంకా ఎంతోమంది బౌలర్లు ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి వన్నె తెచ్చారు. ఇక పేస్ పిచ్ లపై స్పిన్ వేయగల సత్తా ఉన్న క్రికెటరే షేన్ వార్న్. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియాకు వరంలా దొరికాడు. షేన్ వార్న్, మెక్ గ్రాత్ ల ద్వయం తీసిన వికెట్లు కొన్ని వందల్లోనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు ఎన్నో విజయాలు అందించారు.
Australia బ్యాటింగ్ దుర్బేద్యం..
అడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilcrist ), మ్యాథ్యూ హెడెన్ ఇద్దరి ఓపెనింగ్ జోడి ఇప్పటి టీ 20 క్రికెట్ లా ఉండేది. ప్రతి మ్యాచులో ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకుపడేవారు. వీరిద్దరిలో ఎవరూ ఔటైనా రికీ పాంటింగ్ గురించి తెలిసిందే.. ఆటలో మాటతీరులో అత్యంత అగ్రెసివ్ గా ఉండే రికీ పాంటింగ్ బ్యాటింగ్ కు వచ్చాడంటే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు వణుకే. 2003 వన్డే వరల్డ్ కప్ లో రికీ పాంటింగ్ చేసిన 150 పరుగులే ఆ టీంకు వన్డే వరల్డ్ కప్ ను అందించిందని చెప్పడం లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక మిడిలార్డర్ లో డామియన్ మార్టిన్, లెమెన్, అండ్రూ సైమండ్స్, మైకెల్ క్లార్క్ లు విరోచితంగా పోరాడేవారు. ఇలా బ్యాటింగ్ బలం ఎంతో దుర్బేద్యంగా ఉండేది..
బ్యాటింగ్ లో ఇద్దరు ఆపద్భాంధవులు
1999 నుంచి 2003 వరల్డ్ కప్ వరకు మైకెల్ బెహన్ (Michal Bevan) అనే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ చేసిన వీరోచిత పోరాటాలు అద్బుతం.. మ్యాచ్ లో వికెట్లు పడుతున్నా.. బౌలర్లను బ్యాటింగ్ కు వచ్చిన వారిని అడ్డుపెట్టుకుని మ్యాచును చివరి వరకు తీసుకువచ్చి గెలిపించేవాడు. ఇలా ఎన్నో మ్యాచుల్లో ఆసీస్ కు మరుపురాని విజయాలు అందించాడు. మైకెల్ బెవాన్ తర్వాత మైక్ హస్సీ ఇదే బాధ్యత తీసుకున్నాడు. మైక్ హస్సీ ఆరో స్థానంలో వచ్చి జట్టుకు మంచి ఫినిష్ ఇచ్చేవాడు. ఇలా ఆసీస్ జట్టుకు 10 నుంచి 15 ఏళ్ల కాలం సువర్ణయుగంగా చెప్పొచ్చు..
Australia పేస్ బౌలింగ్ దళపతి
గ్లెన్ మెక్ గ్రాత్ పేస్ బౌలింగ్ దళపతి. ఆస్ట్రేలియా టీం పేస్ బౌలింగ్ లో ఇప్పటికీ ఇంతలా రాణిస్తుందంటే కారణం గ్లెన్ మెక్ గ్రాత్ కారణం. మెక్ గ్రాత్ ఇన్ స్వింగ్ వేయడంలో దిట్ట. సచిన్, లారా లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లను కూడా మెక్ గ్రాత్ ముప్పుతిప్పలు పెట్టాడు. మెక్ గ్రాత్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎంత గొప్ప క్రికెటర్ అయినా సంయమనం పాటించాల్సిందే. లేదు ఇష్టారీతిన ఆడతానంటే వికెట్ సమర్పించుకోవాల్సందే. ముఖ్యంగా జాసెన్ గెలెస్పీ ( Jason gelesphy ) ఇద్దరు కలిసి ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేవారు. ఓడిపోతే తట్టుకునే వారు కాదు. అంతలా డెడికేట్ గా బౌలింగ్ చేసేవారు.
స్పిన్ రారాజు.. షేన్ వార్న్
ఆస్ట్రేలియా అంటేనే బౌన్సీ, ఫాస్ట్ పిచ్ లు తయారు చేస్తారు. వాతావరణం కూడా అలాగే సహకరిస్తుంది. కానీ ఇలాంటి పిచ్ లపై కూడా ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ (Shane Warne) ఎక్కువగా స్పిన్ బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ లో ఎంతో మందికి ఆరాధ్య దైవంలా నిలిచాడు. లెగ్ స్పిన్ వేయడంలో ఎన్నో కిటుకును నేర్చుకుని బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సత్తా చాటాడు. 600 వికెట్లకు పైగా తీసి ప్రపంచంలో ఎక్కువ వికెట్లు తీసిన రెండో స్పిన్నర్ గా నిలిచాడు.
ఇక ఫీల్డింగ్ వంతు..
ఫీల్డింగ్ లో ఆసీస్ ను ముందుకు నడిపించింది. కెప్టెన్ రికీ పాంటింగ్ అని చెప్పొచ్చు. రికీ పాంటింగ్ డైవింగ్ లు చేస్తూ క్యాచ్ లు తీసుకునేవాడు. రనౌట్లు చేయడంతో త్రోలు విసరడంలో ఎంతో నేర్పరి. రికీ పాంటింగ్ తర్వాత అండ్రూ సైమండ్స్, మైకెల్ క్లార్క్ (Michal Clarke) ఇద్దరు ఆస్ట్రేలియాకు గొప్ప ఫీల్డింగ్ చేయగల ప్రతిభావంతమైన యువకులు దొరికారు. అండ్రూ సైమండ్స్ మైదానంలో చిరుతలా కదిలేవాడు.
ఇలా పది దాదాపు 15 సంవత్సరాల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా డామినేట్ నడిచింది. వన్డే వరల్డ్ కప్ లను వరుసగా మూడు సార్లు సాధించి ప్రపంచ క్రికెట్ లో పెద్దన్న పాత్ర పోషించి ప్రత్యర్థి జట్ల భరతం పట్టిన ఆసీస్ టీం ఇప్పుడు అలాంటి ఆటతీరు కనబర్చలేకపోతుంది. ఒకప్పుడు ఆసీస్ అంటే ప్రత్యర్థి జట్లకు వణుకు. కానీ అంతటి భయంకరంగా లేకున్నా.. ఇప్పుడు కూడా బలంగానే ఉన్నా.. అప్పటి జట్టు అంటేనే అందరికీ ఇష్టం.. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ సమతూకంగా ఉండేది. అందుకే ఆసీస్ ఈస్ ద బెస్ట్. ఆల్ టైమ్ ఆసీస్ ఫేవరేట్ జట్టు ఏదైనా ఉందంటే అందరూ టక్కున చెప్పేది 2003 వరల్డ్ కప్ టీం అని.. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఎక్స్ పర్ట్స్ కూడా అదే చెబుతున్నారు.