Who has taken the most wickets for Punjab Kings: పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పంజాబ్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన పీయూష్ చావ్లా (84) రికార్డును అర్షదీప్ సింగ్ (86) అధిగమించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అరంగ్రేటం చేసిన అర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు పంజాబ్ తరఫున మ్యాచులు ఆడాడు. ఆర్సీబీ తో బెంగళూరులో జరిగిన మ్యాచులో ఫిల్ సాల్ట, విరాట్ కొహ్లీలను అవుట్ చేసిన అర్షదీప్ సింగ్ ఈ అరుదైన ఘనత తన సొంతం చేసుకున్నాడు.
Who has taken the most wickets for Punjab Kings: వేలంలో రూ. 18 కోట్లు పెట్టి తీసుకుంటే
పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్ ను ఈ సారి వేలంలో ఏకంగా రూ. 18 కోట్లు పెట్టి రైట్ టు మ్యాచ్ దక్కించుకుంది. అంతకు ముందు వేలానికి వదిలేయడంతో అర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా నుంచి లెఫ్ట్ అయ్యాడు. దీంతో ఈ సారి వేలంలో పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్ ను తీసుకోకపోవచ్చని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ అర్షదీప్ కు అత్యధికంగా రూ. 18 కోట్లు పెట్టిమరీ తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే పాయింట్ల టేబుల్స్ లో రెండో స్థానంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచుల్లో అయిదు గెలిచి రెండింట్లో ఓడి రెండో ప్లేస్ లో కొనసాగుతుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తాను ముందుండి టీంను నడిపిస్తున్నాడు. యుజ్వేంద్ర చాహాల్ కూడా పామ్ లోకి వచ్చేశాడు. లాస్ట్ రెండు మ్యాచుల్లో ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో ప్రియాంశ్ ఆర్య కూడా సూపర్ పామ్ లో ఉన్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది.