Sanju Samson: సంజు శాంసన్, రాహుల్ ద్రవిడ్ మధ్య విభేదాలు ఉన్నాాయా?

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ టీం ఐపీఎల్ 2025లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడిపోతుంది. దీనికి తోడు సంజు శాంసన్ ను గాయాల బెడద వీడటం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు పక్కటెముల గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అప్పటికే సంజు శాంసన్ 19 బంతుల్లో 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

Sanju Samson: పిలుస్తున్నా వెళ్లిపోయినా సంజు

అయితే ఆ తర్వాత యశస్వి జైశ్వాల్, నితీశ్ రానా ఇద్దరూ పోరాడినా చివరి ఓవర్లలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను టై చేశాడు. దీంతో రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ సమయంలో డగౌట్ లో కోచ్ రాహుల్ ద్రవిడ్ అందరూ ప్లేయర్లతో చర్చలు జరుపుతున్నాడు. కానీ అందులో సంజు శాంసన్ లేడు. అదే సమయంలో అటుగా వెళుతున్న సంజు ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. తోటి ప్లేయర్ ఇటు రమ్మని పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా పోవడంపై కోచ్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నట్లు అనుకుంటున్నారు.

నెటిజన్లు ట్రోల్స్

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు ఉంటే టీం ఎలా గెలుస్తుందని అంటున్నారు. సీనియర్ రాహుల్ ద్రవిడ్ సర్ చెప్పినా మాట వినాలని ఆయన జట్టు కోసం ఏదైనా చేస్తారని సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం సంజు శాంసన్ లక్నో తో మ్యాచ్ లో అందుబాటులో ఉంటే అవకాశం కనిపించడం లేదు. గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే మ్యాచులకు రియాన్ పరాగ్ కు ( Riyan Parag) బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మొదటి మూడు మ్యాచులకు రియాన్ పరాగ్ కే కెప్టెన్సీ అప్పజెప్పారు.

కెప్టెన్లను మారుస్తున్నా

రాజస్థాన్ రాయల్స్ 2008 సీజన్ లో కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఐపీఎల్ టైటిల్ ను మళ్లీ అందుకోలేదు. దీని కోసం జట్టులోని ప్లేయర్లను మారుస్తున్నా… కెప్టెన్లను మారుస్తున్నా.. ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ యూసుప్ పఠాన్, రవీంద్ర జడేజా, షేన్ వార్న్, షేన్ వాట్సాన్ ఉన్న సమయంలో టైటిల్ గెలిచింది

Leave a Comment