Bumrah: బుమ్రా ఫిట్ గా లేడు అందుకే కెప్టెన్సీ ఇవ్వలేం Bumrah is not fit thats why he cant be given the captaincy

Bumrah: టీం ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ గా గిల్ (Gill) ఎంపిక, బుమ్రా ఎంపిక కాకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరాలు వెల్లడించారు. జస్ ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్యలు, వర్క్‌లోడ్‌ కారణంగా అన్ని మ్యాచులూ ఆడలేడని బీసీసీఐ చీఫ్‌ కోచ్‌ అజిత్‌ అగార్కర్ (Agit agarkar) తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Bumrah: అజిత్ అగార్కర్ క్లారిటీ

అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Bumrah) ఇంగ్లాండ్‌తో జరగనున్న అన్ని మ్యాచ్‌లను ఆడగలిగే స్థితిలో లేడని ఫిజియోథెరపిస్టులు చెప్పారని అన్నారు. దీంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు కాబట్టి అతడిని కెప్టెన్ గా ఎంపిక చేయలేకపోయామన్నారు. గిల్ కెప్టెన్సీపై కూడా వివరణ ఇచ్చాడు. శుభమన్ గిల్ ఆటతీరును ఏడాదిగా పరిశీలిస్తున్నాం. ఒత్తిడిని తట్టుకుని రాణించగల సత్తా ఉందని నమ్ముతున్నామని అజిత్ అగార్కర్ అన్నాడు. మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, సర్పరాజ్ ఖాన్ లను పక్కన పెట్టారు.

Leave a Comment