Shubman Gill: భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ గా శుభమన్ గిల్

Shubman Gill named India Test cricket captain

Shubman Gill: భారత క్రికెట్ టీం కెప్టెన్ గా శుభమన్ గిల్ ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇండియా టెస్ట్ కెప్టెన్ గా శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేసింది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్ లో జరగబోయే అయిదు టెస్టు మ్యాచుల (India England Test Series) సిరీస్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

Shubman Gill లక్కీ కొట్టిన కరుణ్ నాయర్, సాయి సుదర్శన్

ఐపీఎల్ లో అదరగొడుతున్న సాయి సుదర్శన్, రంజీ ట్రోపీతో పాటు డొమెస్టిక్ సీజన్ లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ (Karun Nair) పై సెలెక్టర్లు దయ చూపారు. ఇద్దరికీ చాన్స్ ఇచ్చారు. మొత్తం 18 మంది తో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు.

రోహిత్, విరాట్ కొహ్లీ రిటైర్ తో సందిగ్ధం

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా భారత క్రికెట్ కుదుపునకు లోనైంది. అందుకే యంగ్ ప్లేయర్ కు టెస్ట్ పగ్గాలు అప్పగిస్తే ఎక్కువ రోజుల పాటు టెస్టు క్రికెట్ కు ఇబ్బంది ఉండదని భావించింది. అందుకే శుభమన్ గిల్ కు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే చాలా మంది జస్ ప్రీత్ బుమ్రా పేరును ప్రతిపాదించారు. కానీ బౌలింగ్ భారం మోయాల్సింది బుమ్రా (Jasprit Bumrah) ఇటు బౌలింగ్, అటు కెప్టెన్సీ చేయలేదని భావించిన సెలెక్టర్లు శుభమన్ వైపు మొగ్గు చూపారు.

టీమ్‌ ఇండియా జట్టు

శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌). రిషభ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), నితీశ్ కుమార్‌ రెడ్డి, సాయి సుదర్శన్‌ , అభిమన్యు ఈశ్వరన్‌, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, కరుణ్‌ నాయర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Leave a Comment