David Warner: కరాచీ కింగ్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్

David Warner: డేవిడ్ వార్న‌ర్ సెలెక్ట్ కాక‌పోవ‌డంతో పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ లో పాల్గొన‌నున్నాడు. పీసీఎల్ లో పేరు న‌మోదు చేసుకోవ‌డంతో అత‌డిని కరాచీ కింగ్స్ (Karachi Kings)టీం తీసుకుంది. డేవిడ్ వార్న‌ర్ ను కెప్టెన్ గా నియ‌మించింది. పీసీఎల్ జూన్ లో ప్రారంభం కానుండ‌గా.. ఈ మేర‌కు క‌రాచీ కింగ్స్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

రూ. 2.46 కోట్ల‌కే

కాగా కరాచీ కింగ్స్ టీంకు ఈ సారి కేన్ విలియ‌మ్ స‌న్ కూడా ఆడ‌నున్నాడు. ఇద్ద‌రు స‌న్ రైజ‌ర్స్ మాజీ కెప్టెన్లు క‌రాచీ కింగ్స్ టీంలోకి ఎంట‌ర్ కావ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపు ఆ ఫ్రాంచైజీ మీద ప‌డింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్ సన్ అమ్ముడుపోలేదు. దీంతో పీఎస్ఎల్‌ వేలంలో రూ. 2.56 కోట్లకు వార్న‌ర్‌ను క‌రాచీ కింగ్స్ కొనుగోలు చేసింది.

కేన్ మామా.. డేవిడ్ వార్న‌ర్ ఒకే జ‌ట్టులో..

కేన్ విలియ‌మ్ స‌న్(Kane Williamson), డేవిడ్ వార్న‌ర్, టిమ్ సీఫ‌ర్ట్, లిట‌న్ దాస్ లాంటి విదేశీ ప్లేయ‌ర్లతో ఆ జ‌ట్టు బ‌లంగా తయారైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఐపీఎల్ కు పెద్ద పీట వేసిన డేవిడ్ వార్న‌ర్ ఇక పాకిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఆడ‌నుండ‌టం స‌రికొత్త‌గా మారింది. బంగ్లా ప్రీమియ‌ర్, సౌతాఫ్రికా ప్రీమియ‌ర్, పాకిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్ ఎన్ని లీగ్ లు వ‌చ్చినా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ దేనికి లేదు. ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీ కొన‌క‌పోవ‌డంతోనే డేవిడ్ వార్న‌ర్ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పాకిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఆడేందుకు పేరు న‌మోదు చేసుకున్నాడు. డేవిడ్ వార్న‌ర్ ను కెప్టెన్ గా నియ‌మించిన‌ట్లు క‌రాచీ కింగ్స్ త‌న ఎక్స్ ట్విట‌ర్ లో పేర్కొంది. గత సీజన్ లో కెప్టెన్ గా ఉన్న షాన్ మసూద్ ను (Shaun Masood) కెప్టెన్సీ నుంచి తొలగించింది.

కరాచీ కింగ్స్ టీం: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, మీర్ హమ్జా, ఫవాద్ అలీ, రియాజుల్లా, హసన్ అలీ, టిమ్ సీఫెర్ట్, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, , జాహిద్ మహమూద్, అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, లిట్టన్ దాస్, ఇమ్మాద్ మమ్‌జామ్, యూసుప్.

Leave a Comment