Ashutosh Sharma : అశుతోష్ శర్మ ఆట చూసి ప్రీతి జింటా కంట కన్నీరే

Ashutosh Sharma: ఐపీఎల్ 2025 లో అసలైన మజా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మధ్య జరిగింది. అశుతోష్ శర్మ ఎప్పటిలాగే వికెట్లు పడుతున్నా చివరి వరకు క్రీజులో ఉండి తన పోరాట పటిమతో ఢిల్లీని గట్టెక్కించాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసిన అశుతోష్ శర్మ మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి మరుపురాని విజయాన్ని అందించాడు.

శిఖర్ దావన్ శిష్యుడిగా..

2024 ఐపీఎల్ సీజన్ లో శిఖర్ దావన్ (Shikhar Dhawan)శిష్యుడిగా పంజాబ్ కింగ్స్ లో ఎంట్రీ ఇచ్చిన అశుతోష్ శర్మ అయిదారు కీలక ఇన్సింగ్స్ లు ఆడాడు. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇద్దరు కలిసి పెద్ద పెద్ద స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశారు. అదేదో గాలివాటం కాదని అశుతోష్ శర్మ మళ్లీ నిరూపించాడు. లక్నో తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో ఏ మాత్రం ఆశలు లేని సమయంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్ మొదటి 20 బంతులకు కేవలం 20 పరుగులే చేశాడు. ఆ తర్వాత 11 బంతులకు 46 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకుని దాన్ని తన మెంటర్ శిఖర్ దావన్ కు అంకితం చేస్తున్నట్లు అశుతోష్ శర్మ ప్రకటించాడు.

ఉత్కంఠకు పరాకాష్ఠ

బంతి బంతికి సమీకరణాలు చేంజ్ అవుతుండగా.. పట్టుదలతో క్రీజులో ఉన్నాడు. చివరికి తొమ్మిది వికెట్లు పడ్డా కూడా ఏ మాత్రం టెన్షన్ పడకుండా చివరి బ్యాట్స్ మెన్ మోహిత్ శర్మ సింగిల్ తీయగానే షాబాద్ బౌలింగ్ లో సిక్సు కొట్టేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. మధ్యలో విరాగ్ నిగమ్ 15 బంతుల్లో 39 అయిదు ఫోర్లు, రెండు సిక్సులతో చెలరేగగా.. ఆ తర్వాత అశుతోష్, అయిదు సిక్సులు, అయిదు ఫోర్లతో విశాఖపట్నంలోని స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

ప్రీతిజింటాకు కన్నీరే

ఐపీఎల్ మెగా యాక్షన్ సమయంలో అశుతోష్ శర్మను తీసుకోవాలని ప్రీతి జింటా (Preity Zinta) పట్టుబట్టింది. కానీ ప్రీతి జింటా భర్త నెస్ వాడియాతో పాటు మిగతా ఫ్రాంచైజీ ఓనర్లు లైట్ తీసుకున్నారు. కేవలం రూ. 3.80 కోట్లకే అశుతోష్ ను వదిలేసుకున్నారు. దీంతో అశుతోష్ శర్మ ను ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి శభాష్ అనిపించుకుంది. అయితే ఆ సమయంలో పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న ప్రీతి జింటా.. అశుతోష్ ను సెలెక్ట్ చేయకపోవడంతో తెగ బాధపడింది. ఇప్పుడు అశుతోష్ ఆట చూసి మరింత ఏడ్వడం ఖాయమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) టీంకు ఆటగాళ్ల సెలక్షన్ లో చాలా లోపాలున్నాయని కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Comment