The magic of juniors: ఐపీఎల్ రాణించి ఇండియా మెయిన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చేదెవ‌రూ.. ?

The magic of juniors ఐపీఎల్ యువ క్రికెట‌ర్ల‌కు గొప్ప వేదిక‌. ఇక్క‌డ రాణిస్తే చాలు నేరుగా టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేయ‌వ‌చ్చు. ఇలాంటి సువ‌ర్ణావ‌కాశాన్ని ఈ సారి ఎవ‌రూ అందుకోనున్నారు. ఏ టీం యువ ఆట‌గాడు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుని ఇండియా మెయిన్ టీం లోకి ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఈ సారి జూనియ‌ర్ల మాయాజాలం ఖాయంగా ఉండేలా కనిపిస్తోంది.

మొద‌టి మ్యాచ్ లోనే మెరిసిన ఇషాన్ కిష‌న్

ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసి ఆక‌ట్టుకున్నాడు. ఇప్ప‌టికే బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోయి జాతీయ జ‌ట్టుకు దూర‌మైన బాధ ఒక‌వైపు అయితే.. మ‌రో వైపు తాను ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్న ముంబ‌యి ఇండియ‌న్స్ అత‌డిని దూరం పెట్టింది. దీంతో స‌న్ రైజ‌ర్స్ రూ. 11.25 కోట్ల‌కు ఐపీఎల్ వేలంలో ద‌క్కించుకుంది. దీనికి న్యాయం చేస్తూ ఇషాన్ కిష‌న్ అద‌ర‌గొడుతున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు సాయంతో సెంచ‌రీ సాధించి గోడ‌కు కొట్టిన బంతిలా వ‌చ్చేశాడు.

శ్రేయస్ అయ్య‌ర్ హిట్

శ్రేయ‌స్ అయ్య‌ర్ బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోయిన మ‌రో క్రికెట‌ర్.. అయినా గౌత‌మ్ గంభీర్ కోచ్ గా ఉండ‌టం వ‌ల్ల టీం ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు. అంతే కాదు చాంపియ‌న్స్ ట్రోపీలో రాణించి టీం ఇండియా క‌ప్ నెగ్గ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాల‌నే నిబంధ‌న‌ను కాద‌న్నందుకు శ్రేయ‌స్ అయ్య‌ర్ కు బీసీసీఐ కాంట్రాక్టు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత రంజీ ట్రోపీలో, దులీప్ ట్రోపీ, ముస్తాక్ టీ 20 లో రాణించాడు. దీంతో పాటు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు 2024 ఐపీఎల్ టైటిట్ సాధించి పెట్టాడు. ఇప్పుడు కోల్ క‌తా కూడా కాద‌నుకోవ‌డంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా నియ‌మితుడై మొద‌టి మ్యాచ్ లోనే 97 ప‌రుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు.

ఇందులో ఎవ‌రో అదృష్ట‌వంతులు

ఐపీఎల్ లో గ‌త సీజ‌న్ లో పంజాబ్ కింగ్స్ కు ఆడిన అశుతోష్ శ‌ర్మ‌ది (Ashutosh Sharma) మ‌రో నేప‌థ్యం. దేశీ వాలీలో బాగా రాణిస్తున్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు రాలేదు. అయితే గ‌తేడాది పంజాబ్ కింగ్స్ ఆదుకుంది. అవ‌కాశాలు ఇచ్చింది. దానికి అశుతోష్ త‌గిన న్యాయం చేశాడు. కానీ అనూహ్యంగా ఐపీఎల్ 2025 లో వేలంలో అత‌డిని వ‌దిలేసుకుంది. పంజాబ్ ఏదైనా చేసిన త‌ప్పు ఉందంటే ఇదొక్క‌టే అని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్ లో ప్ర‌స్తుతం శ‌శాంక్ సింగ్ ను Shashank Singh మాత్ర‌మే ఇండియాకు సెల‌క్ట్ కాకుండా మంచి ప్లేయర్ గా కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఆరు మ్యాచులే జ‌రిగినా ఇషాన్ కిష‌న్, శ్రేయ‌స్ అయ్య‌ర్, అశుతోష్ శ‌ర్మ‌, ముంబ‌యి ఇండియ‌న్స్ బౌల‌ర్ ఆటో డ్రైవ‌ర్ కొడుకు విగ్నేశ్, పంజాబ్ బ్యాట‌ర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya). విరాజ్ నిగ‌మ్ త‌మ స‌త్తా నిరూపించుకున్నారు. మ‌రి ఈ సారి రాబోయే రోజుల్లో ఎవ‌రూ త‌మ స‌త్తా చాటుకుని టీం ఇండియా తలుపు త‌డ‌తారో చూడాలి.

Leave a Comment