Rajat Patidar:2008 తర్వాత చెపాక్ లో ఆర్సీబీ విజయం

Rajat Patidar: ఐపీఎల్ 2025లో మరో సంచలనం నమోదైంది. 2008 ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పై చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్ ల్లో ఆర్సీబీ ఓడిపోయింది. కానీ ఎట్టకేలకు 2025 లో ఆర్సీబీ ఆ కొరతను తీర్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై చెపాక్ స్టేడియంలో గెలిచి ఆ కరువును తీర్చుకుంది.

దిగ్గజాలతో కానిది..

విరాట్ కొహ్లీ, క్రిస్ గేల్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లాంటి ఎంతో మంది కెప్టెన్లు సాధించలేనిది రజత్ పటిదార్ సాధించి చూపించాడు. బ్యాటింగ్ కూడా మెరిసిన రజత్ (51) పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలింగ్ లో మొదటి అయిదు ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ ను దెబ్బతీసింది.

చెపాక్ లో ఎలాగైనా గెలవాలని

ఈ మ్యాచ్ విరాట్ కొహ్లీ కూడా 31 పరుగులు చేసి సాధికార ఇన్సింగ్స్ ఆడాడు. మొత్తం మీద ఇన్ని సీజన్ లలో చెన్నై లోని చెపాక్ లో గెలవాలని ఎంతో కోరికగా ఉన్న ఆర్సీబీకి ఇన్నాళ్లకు కల నెరవేరింది. అలా ఇలా కాదు.. ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడించింది.

చెపాక్ లో ఇదే అత్యధిక పరుగుల ఓటమి

చెపాక్ స్టేడియంలో ఇదే అత్యధిక పరుగుల ఓటమి కావడం గమనార్హం. ఇప్పటి వరకు జరిగి అన్నిమ్యాచుల్లో చెన్నైకు ఇదే 50 పరుగుల తేడాతో ఓటమి కావడంతో ఆ జట్టు యాజమాన్యం ఇప్పుడు జట్టు కూర్పుపై దృష్టి సారించే అవకాశం ఉంది.

also read https://t20timepass.com/ms-dhoni/

Leave a Comment