Dhoni stumping : అతడు రిటైర్ అయి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడక చాలా ఏళ్లు అవుతుంది. కానీ కేవలం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడతాడు. బ్యాటింగ్ లో ఎనిమిదో స్థానంలో వస్తాడు. అయినా మ్యాచ్ లో మాత్రం మెరుపు స్టంపింగ్ తో యువ వికెట్ కీపర్లకు సవాల్ విసురుతున్నాడు. ఆయనే వెటరన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. వయసు పెరిగిన వన్నె తగ్గని హీరో మహేంద్ర ధోని. ఇప్పటికే ఐపీఎల్ 2025లో మెరుపు స్టంపింగ్ తో ముంబయి ఇండియన్స్ పై సూర్య కుమార్ యాదవ్ ను స్టంపౌంట్ చేసిన ధోని.. రాయల్ చాలెంజర్ బెంగళూరు మ్యాచ్ లో మరో మెరుపు స్టంపింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇలా Dhoni stumping చేయడం చూసి యువ క్రికెటర్ల తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
వేరే ఎవరూ ఉన్నా.. సాధ్యం కాదు
ఐపీఎల్ 2025 లో ధోని ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో సూర్య కుమార్ ను మెరుపు స్టంపింగ్ చేసి ఆకట్టుకోగా.. ఆర్సీబీ మ్యాచ్ లో సీన్ రీపీట్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. నూర్ బౌలింగ్ లో ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (Phil Salt)ను మెరుపు స్టంపింగ్ చేశాడు. వేరే వికెట్ కీపర్ ఎవరున్నా కూడా అక్కడ స్టంపింగ్ చేసే అవకాశమే లేదు. కాలును ఇలా తీసి వెనక్కి పెట్టేలోగా స్టంపౌంట్ చేసేశాడు. దీంతో ఫిల్ సాల్ట్ తో పాటు ఫీల్డ్ అంపైర్లు కూడా థర్డ్ అంపైర్ వైపు చూడాల్సి వచ్చింది. Dhoni stumpingకి ఎవరికైనా కళ్లు చెదిరిపోవాల్సిందే.
Also Read : MS DHONI ఆ విషయంలో నెంబర్ వన్ మహేంద్ర దోనినే
చివర్లో అలరించిన ధోని
ధోని ఆర్సీబీ మ్యాచ్ లో లాస్ట్ లో బ్యాటింగ్ కు వచ్చిన చివరి ఓవర్ లో రెండు సిక్సులు, ఓ ఫోర్ తో ఆడియన్స్ ను ఆనందపరిచాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో రెండు భారీ సిక్సులు బాది ఓటమి అంతరాన్ని తగ్గించాడు. కానీ 2008 తర్వాత ఆర్సీబీపై ఇంత పేలవంగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓడిపోవడం ఇదే మొదటి సారి. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి పట్టు ఉంటుంది. ఆ పిచ్ ప్రవర్తించే తీరు.. ఉక్కపోత ఇతర జట్లు ఎక్కువగా ఆ వాతావరణానికి తట్టుకోలేవు. కాగా ఫస్ట్ సీజన్ తర్వాత ఆర్సీబీ చెన్నై లో ఎప్పుడు గెలవకపోగా.. అందరూ నెటిజన్లు ఏముందిలే మళ్లీ చెన్నై గెలుస్తుందని తేలిగ్గా తీసి పారేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్సీబీ చెన్నైను చెపాక్ స్టేడియంలో ఓడించి శభాష్ అనిపించుకుంది.