What is slow over rate in IPL : ఐపీఎల్ స్లో ఓవర్ రేట్ రూల్స్ గురించి తెలుసా?

What is slow over rate in IPL : IPL‌లో slow over rate విషయం గురించి మీకు తెలుసా.. 2025 సీజన్ నుంచి స్లో ఓవర్ రేట్ విషయంలో మారిన రూల్స్, అలాగే పెనాల్టీలు, Match ban (మ్యాచ్ బ్యాన్) గురించి వివరంగా తెలుసుకుందాం. 

What is slow over rate in Telugu  :  స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి?

BCCI ఐపీఎల్లో మ్యాచ్ ఇన్ టైంలో జరగడానికి రూపొందించిన విధానమే స్లో ఓవర్ రేటు. ఈ విధానంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం.. 20 ఓవర్లు 5నిమిషాల 2 strategeic timeouts కలుపుకుని మొత్తం 90నిమిషాల్లో బౌలింగ్ టీం తమ బౌలింగ్ ఇన్నింగ్స్  పూర్తి చేయాలి. DRS (రనౌట్, స్టంపింగ్, తదితర రివ్యూ టైంలలో), ప్లేయర్లకు ఇంజూరీ, డ్రింక్ బ్రేక్స్ వంటి వాటికి తీసుకునే టైమ్‌ను ఇందులో కలపరు. అంటే వాటికి మినహాయింపు ఉంటుంది. ఇక 20 ఓవర్లు 90 నిమిషాల్లో పూర్తి చేయకపోతే బౌలింగ్ టీం కెప్టెన్‌కు, అలాగే టీం‌కు పెనాల్టీలు ఉంటాయి. 

Slow over rate penalty in ipl : ఐపీఎల్ స్లో ఓవర్ రేట్ ఎలా లెక్కించబడుతుంది?

20 ఓవర్లు 90 నిమిషాల్లో పూర్తి చేయకపోతే బౌలింగ్ టీం కెప్టెన్‌కు తొలిసారి ₹12 లక్షల జరిమానా విధిస్తారు. సీజన్లో తొలిసారి slow over rate‌కు కేవలం కెప్టెన్‌కు మాత్రమే ఫైన్ ఉంటుంది. 

రెండోసారి తప్పు చేస్తే  కెప్టెన్ కు ₹24 లక్షలు, మిగతా ఆటగాళ్లకు ₹6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% (ఏది తక్కువైతే అది) పెనాల్టీగా విధిస్తారు. 

మూడోసారి అయితే  కెప్టెన్ కు ₹30 లక్షలు ఫైన్ + ఒక మ్యాచ్ నిషేధం, అలాగే మిగితా ప్లేయర్స్ కు ₹12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50%  (ఏది తక్కువైతే అది) పెనాల్టీగా విధిస్తారు. అయితే ప్రస్తుత 2025‌లో ఒక మ్యాచ్ నిషేధం రూల్ లేదు. Match ban‌కి బదులు కొత్త రూల్స్ బీసీసీఐ ప్రవేశపెట్టింది. 

Slow over rate rules in ipl 2025: ఐపీఎల్ న్యూ రూల్స్

BCCI తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. slow over rate విషయంలో  కెప్టెన్లకు మ్యాచ్ నిషేధం (Match ban) విధించకుండా కొత్తగా డీమెరిట్ పాయింట్లు ఇవ్వనున్నారు. ICC ప్రవర్తనా నియమావళి ఆధారంగా ఈ డీమెరిట్ పాయింట్ల వ్యవస్థను రూపొందించారు. అయితే ICCలో డీమెరిట్ పాయింట్లు 5 ఏళ్ల పాటు కొనసాగితే, BCCI కేవలం 3 ఏళ్ల (36 నెలలు) పాటు మాత్రమే అమలు చేస్తుంది. 

Demerit points in IPL: ఐపీఎల్ డీమెరిట్ పాయింట్స్

BCCI అభిప్రాయం ప్రకారం.. కెప్టెన్ కు Match Ban (మ్యాచ్ నిషేధం) విధించడం సరికాదని ఆ రూల్ తీసేసింది. నిషేధం విధించాలంటే పాయింట్స్ సిస్టం తీసుకొచ్చింది. ఈ  డీమెరిట్ పాయింట్ల విధానం ప్రకారం.. 25% మ్యాచ్ ఫీజు కలిగిన పెనాల్టీ పడ్డప్పుడు ఒక డీమెరిట్ పాయింట్ ప్లేయర్ లేదా కెప్టెన్ కు ఇస్తారు.. అలా మ్యాచ్ ఫీజు పెనాల్టీ బట్టి పాయింట్స్ నమోదవుతాయి. ఆ పాయింట్స్ 36 నెలల పాటు వ్యాలీడిటీతో ఉంటాయి. ఇక మ్యాచ్ నిషేధం విధించాలంటే పాయింట్స్ అనుసరించి ఉంటుంది. 
4-7 పాయింట్లు – 1 మ్యాచ్ నిషేధం
8-11 పాయింట్లు – 2 మ్యాచ్‌లు నిషేధం
12-15 పాయింట్లు – 3 మ్యాచ్‌లు నిషేధం
ఇలా Match Ban అమలు చేయనున్నారు. 

Also read : Dhoni stumping: మెరుపులా స్టంపింగ్ చేయడం దోనికే సాధ్యం

Why hardik pandya fined : అందుకే హార్దిక్‌కు ఫైన్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన (Hardik Pandya) హార్దిక్ పాండ్యాకు slow over rate కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది. IPL 2025లో భాగంగా  గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. నిర్దిష్ట 20 ఓవర్ల బౌలింగ్ ను ముంబై టీం 90 నిమిషాల్లో పూర్తి చేయలేదు. ఆ కారణంగా ఆయనకు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఫైన్ విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ఆర్టికల్ 2.2 అనుసరించి  ఈ జరిమానా విధించింది. 

గత సీజన్లోనూ అంతే..

గత సీజన్లో హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ ఇష్యూస్ ఎదుర్కొన్నాడు. ఆ కారణంగానే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ అతను ఆడడానికి వీలు పడలేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియన్స్ టీం తన చివరి మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై టీం స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. అంతకుముందు మరో రెండు మ్యాచ్ లలో కూడా ఆ టీం స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఫలితంగా దశల వారీగా పాండ్యా రూ.12 లక్షలు, రూ.24లక్షల చొప్పున జరిమానాను ఎదుర్కొన్నాడు. ఇక చివరి మ్యాచ్‌లో రూ.30లక్షల జరిమానాతో పాటు మ్యాచ్ నిషేధం అనే వేటు కూడా పడింది. అప్పటికే ఆ సీజన్లో ముంబై మ్యాచ్ లు ముగిశాయి. దీంతో తర్వాతి మ్యాచ్ ఐపీఎల్ 2025లో అతను ఆడాల్సి రాగా.. నిషేధం కారణంగా ఆడలేకపోయాడు.

ఈ సీజన్ స్టార్టింగ్లో స్లో ఓవర్ రేట్ ముంబై టీం నమోదు చేయడంతో మరోసారి హార్దిక్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంకా ముంబై 12 మ్యాచ్ లు ఆడాలి. అందులో రెండు మూడు సార్లు స్లో ఓవర్ రేటు నమోదు చేసినా.. డీ మెరిట్ పాయింట్లు అతని ఖాతాలో పెరిగిపోతాయి. 4కి మించి డీమెరిట్ పాయింట్లు దాటితే నిషేధం ఎదుర్కొవాల్సి రావొచ్చు. ఇప్పటికైనా ముంబై టీం తన బౌలింగ్ పరంగా క్రమశిక్షణ తప్పకుండా చూసుకోవాలి. వైడ్స్, ఎక్స్ ట్రాలు తగ్గించుకోవాల్సిన అవసరముంది. ఫలితంగా ఓవర్ రేట్ పక్కాగా నమోదు చేయొచ్చు. గంట 30 నిమిషాల్లో 20 ఓవర్ల కోటాను పూర్తి చేసేలా.. తదనుగుణంగా ఫీల్డింగ్, బౌలింగ్ సెట్ చేసుకునేలా చూడాలి.

Leave a Comment