Ishan Kishan: ఇషాన్ కిషన్ చాలా ఏళ్ల నుంచి ముంబయి ఇండియన్స్ కు ఆడిన క్రికెటర్. అయితే గత రెండేళ్ల నుంచి అతడిని కష్టాలు వెంటాడుతున్నాయి. సౌతాఫ్రికా సిరీస్ నుంచి అర్థంతరంగా వచ్చేశాడన్న కారణంతో బీసీసీఐ (BCCI) కాంట్రాక్టు కోల్పోయాడు. టీం ఇండియా జట్టులో స్థానం పోయింది. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టు వేలంలోకి వదిలేసింది. ఇలా మొత్తం అన్ని ఇబ్బందికర పరిస్థితులే.. ఇలాంటి సందర్భంలో ఒక్క ఇన్సింగ్స్ తో అన్నింటికీ సమాధానం చెప్పేశాడు. కేవలం తన బ్యాట్ తోనే కొత్త ప్రాంఛైజీ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) తరఫున ఆడుతూ 47 బంతుల్లోనే 106 పరుగులు చేసి గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
కష్టాల్లో తోడు నిలవని ముంబయి ఇండియన్స్
అసలే టీం ఇండియా జట్టులో స్థానం కోల్పోయాడు. గత సీజన్ ఒక్క సారి మాత్రమే ముంబయి తరఫున రాణించలేకపోయాడు. అసలు జట్టులో స్థానం కోల్పోయాడు. ఇది కూడా ముంబయి ఇండియన్స్ కోసమే అని చాలా మందికి తెలియని విషయం. సౌతాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత 2024 లో ఐపీఎల్ కు ముందు ముంబయి ఇండియన్స్(Mumbai Indians) జట్టులో చేరి ప్రాక్టీస్ మొదలెట్టడం బీసీసీఐకు తీవ్ర కోపం తెప్పించింది. దీంతో కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. కానీ చివరకు అదే ముంబయి ఇండియన్స్ ఇషాన్ కిషన్ ను అట్టిపెట్టుకోలేదు. వేలంలోనూ కొనుగోలు చేయలేదు. దీంతో ఇషాన్ కిషన్ ను కావ్య మారన్ తన సన్ రైజర్స్ హైదరాాబాద్ జట్టు తరఫున కొనేసింది. దీంతో ఆడిన మొదటి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ తరఫున సెంచరీ బాది తన సత్తా నిరూపించుకున్నాడు ఇషాన్ కిషన్.

ఇషాన్ రాకతో బ్యాటింగ్ బలం జోరు..
ఇషాన్ కిషన్ కు జాతీయ జట్టుకు మంచి ప్రదర్శనే ఇచ్చాడు. బంగ్లాదేశ్ లో వన్డేలో 200 స్కోరు చేసి తన సత్తా చాటాడు. వికెట్ కీపింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా చురుగ్గా ఉంటాడు. ఇషాన్ కిషన్ రాకతో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ మరింత పెరిగింది. ట్రావిస్ హెడ్,( Travis Head) అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే.. ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో వచ్చి దుమ్ము రేపుతున్నాడు. ఇలా సన్ రైజర్స్ రేంజ్ పెరిగిపోయింది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ 286 పరుగులు చేసి మిగతా జట్టకు హెచ్చరికలు పంపింది. ఇప్పుడు సన్ రైజర్స్ బ్యాటర్లను ఎలా అడ్డుకోవాలో అని ఆయా జట్లు ప్లాన్లు చేసుకుంటున్నాయి.