Punjab Kings are on the rise: ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) రెండు విజయాలతో టోర్నీలో శుభారంభం చేసింది. అసలు ఎప్పుడు చూసినా పాయింట్స్ టేబుల్ లో చివరి ప్లేస్ లో ఉండే పంజాబ్ కింగ్స్ నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. కొత్త కోచ్ రికీ పాంటింగ్, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యంగ్ ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్లతో దూసుకుపోతుంది.
Punjab Kings second place: పాయింట్ల టేబుల్ లో టాప్
ఐపీఎల్ లో పాయింట్ల టేబుల్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings second place) రెండో స్థానంలో కొనసాగుతోంది. దీనికి పక్కా ప్లాన్ అనుసరిస్తున్నట్లు అర్థమవుతుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన రెండు మ్యాచుల్లో సత్తా చాటాడు. కెప్టెన్ గా శ్రేయస్ మొదటి మ్యాచులో 97 పరుగులు, రెండో మ్యాచులో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తన జట్టును గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచులో 242 పరుగుల భారీ స్కోరు చేసిన పంజాబ్ ఈ సారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు అన్ని జట్లకు హెచ్చరికలు పంపింది. అంతే కాదు ఫామ్ లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ టీంను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 16 ఓవర్లలోనే గెలిచి మంచి రన్ రేట్ సాధించింది.
Punjab Kings are on the rise: పంజాబ్ కింగ్స్ గతంలోలా లేదు
ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కామెంటేటర్ నిక్ నైట్ (Nick Knight), భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ (Varun Aaron) ఓ క్రీడా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ కింగ్స్ గతంలోలా లేదు. ఈ సారి కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లు సరైన ప్లాన్ తో ముందుకెళుతున్నారు. పంజాబ్ కింగ్స్ గెలుపు వెనకాల పెద్దగా ఓవర్సీస్ ప్లేయర్లు కనిపించడం లేదు. మ్యాక్స్ వెల్ (Maxwell) మార్కస్ స్టోనియిస్ పరుగులు చేయడం లేదు. అజ్మతుల్లా, పెర్గుసన్ కూడా అంతంత మాత్రమే ఆడారు. అయినా పంజాబ్ కింగ్స్ మాత్రం ఇంతవరకు ఆడిన రెండు మ్యాచుల్లో యంగ్ ఇండియన్ ప్లేయర్ల సత్తానే వాడుకుంది. రెండో మ్యాచులో ప్రభు సిమ్రన్, నేహాల్ వదెరా, శ్రేయస్ అయ్యర్ బ్యాట్ తో సత్తా చాటితే.. మొదటి మ్యాచులో శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ (Shashank Singh)లు అదరగొట్టారు.

ఈసారి వేరే ప్లాన్ తో బరిలోకి
గతంలో ఎప్పుడైనా సరే పంజాబ్ కింగ్స్ ఓవర్సీస్ ప్లేయర్లపై భారీగా నమ్మకం పెట్టుకునేది. కానీ ఈ సారి రూట్ మార్చింది. యంగ్ ఇండియన్స్ కు అవకాశం ఇవ్వాలని వారి సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీనికి కోచ్ రికీ పాంటింగ్, అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ల నమ్మకమే వారిని బాగా ఆడేలా చేస్తోంది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఆడిన రెండు మ్యాచుల్లో కూడా నాటౌట్ గా నిలవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.
యుజ్వేంద్ర చాహల్ రాణిస్తే..

మొత్తం మీద ప్రీతిజింటా (Preity Zinta)తో పాటు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఫుల్ ఖుషీగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ లో ఉన్న అందరూ రాణించారు. ఇక టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాణించాల్సి ఉంది. అతడు ఒక్కడు రాణిస్తే స్పిన్ విభాగంలో కూడా కొరత తీరుతుంది. ఫేస్ బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ లో శ్రేయస్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇదే ఆటతీరు కొనసాగితే పంజాబ్ కింగ్స్ ప్లే ఆప్స్ రేసులో ముందుకు దూసుకెళ్లడం ఖాయం. అదే విధంగా ఎన్నో ఎళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.