Digvesh Rathi controversy: పంజాబ్, లక్నో మ్యాచ్ లో దిగ్వేశ్ రాతి ఓవరాక్షన్

Digvesh Rathi controversy: పంజాబ్ కింగ్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Supergiants) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ అల‌వోక విజ‌యం సాధించ‌గా.. ల‌క్నో స్పిన్న‌ర్ దిగ్వేశ్ రాతి ( Digvesh Rathi ) ఓవ‌రాక్ష‌న్ తో వార్త‌ల్లో నిలిచాడు. మ్యాచులో పంజాబ్ ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్య దిగ్వేశ్ బౌలింగ్ లో సిక్సుకు ప్ర‌య‌త్నించ‌గా.. బాల్ గాల్లోకి లేచింది. దీంతో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే పెవిలియ‌న్ కు వెళుతున్న ప్రియాంశ్ ఆర్య‌కు దిగ్వేశ్ రెచ్చ‌గొట్టేలా సెండ్ ఆఫ్ ఇచ్చాడు.

senior cricketers fire దిగ్వేశ్ పై సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఫైర్

త‌న వికెట్ల ఖాతాలో నీ వికెట్ కూడా ప‌డిందంటూ బుక్ లో రాస్తున్న‌ట్లు అత‌డి ద‌గ్గ‌రికి వ‌చ్చి మ‌రీ రెచ్చ‌గొట్టాడు. దీంతో దిగ్వేశ్ పై సీనియ‌ర్ క్రికెట‌ర్లు, క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఆడుతుంది ఫ‌స్ట్ ఐపీఎల్ ఎందుకంత ఓవ‌రాక్ష‌న్ దిగ్వేశ్ అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. దిగ్వేశ్ ఇలాంటి వికెట్లు ఎన్నో తీయాలి. భ‌విష్య‌త్తులో మంచి క్రికెట‌ర్ గా పేరు సంపాదించాలంటే ఇలాంటి ఆటిట్యూడ్ ఉండే స‌రిపోద‌ని మారాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు.

వెస్టిండీస్ క్రికెట‌ర్ కు బుద్ధి చెప్పిన విరాట్ కొహ్లీ

గ‌తంలో ఓ వెస్టిండీస్ క్రికెట‌ర్ కూడా ఇలాంటి చేతిపై రాత‌లు గీసే కార్య‌క్ర‌మం చేస్తూ మ‌న కింగ్ విరాట్ కోహ్లీ త‌న బ్యాట్ కు ప‌ని చెప్పి అత‌డి అహం అణిచాడు. ఇప్పుడు ఒక ఇండియా క్రికెట‌ర్ ఇలా చేయ‌డంతో చాలా మంది క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు. భార‌త వెట‌ర‌న్ క్రికెట‌ర్ సీనియ‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar) కూడా ఇలాంటి శేష్ట‌లు చేయ‌డం ఎంత మాత్రం మంచిది కాద‌న్నాడు. అలా అయితే బ్యాట‌ర్ బంతిని ఫోర్ కొట్టిన‌ప్పుడల్లా, సిక్సు బాదిన‌ప్పుడ‌ల్లా అలా చేస్తే ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నించాడు. ఆట‌లో స‌త్తా చూపించాలి కానీ ప్ర‌వ‌ర్త‌న‌లో కాద‌ని దిగ్వేశ్ కు చుర‌క‌లంటించాడు.

పంజాబ్ రివర్స్ గేర్

అస‌లే ఐపీఎల్ అందులో చాలా త‌క్కువ అవ‌కాశాలు వ‌స్తుంటాయి. వ‌చ్చిన‌ప్పుడు వాటిని నిరూపించుకునేందుకు ట్రై చేయాలి. అంతే కానీ అన‌వ‌స‌ర కాంట్ర‌వ‌ర్సీల‌కు పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని దిగ్వేశ్ తెలుసుకోవాలి. ఎంత ఎదిగినా ఓదిగి ఉండేందుకు ట్రై చేయాల‌ని సూచిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ 16 ఓవ‌ర్ల‌లోనే ల‌క్నో విధించిన 172 టార్గెట్ ను ఛేజ్ చేసి పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలోకి దూసుకెళ్లిపోయింది. ఎప్పుడూ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉండే పంజాబ్ (Punjab Kings) ఇప్పుడు రివ‌ర్స్ గేర్ లో పోతుంది. దీనికంత‌టికి కార‌ణం కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

Leave a Comment