Big Bash League: టీం ఇండియా బ్యాటర్ కింగ్ విరాట్ కొహ్లీ (Virat Kohli) బిగ్ బాష్ టీ 20 లీగ్ లో ఆడనున్నట్లు అది కూడా రెండు సీజన్ లకు అని సిడ్నీ సిక్సర్స్ టీం తన సోషల్ మీడియా అకౌంట్లలో పేర్కొంది. అదేంటి ఇప్పుడు విరాట్ కొహ్లీ ఐపీఎల్ ఆడుతున్నాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో ఇంకా రిటైర్డ్ కాలేదు. కేవలం టీ 20లకే రిటైర్ మెంట్ ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడెందుకు ఇలా సడెన్ గా నిర్ణయం తీసుకున్నాడని అందరూ షాక్ అయ్యారు.
బీసీసీఐ అనుమతి కావాల్సిందే
బీసీసీఐ (Bcci) అనుమతి లేనిదే ఏ క్రికెటర్ కూడా వేరే లీగ్ లలో టీం ఇండియా కు ఆడే ప్లేయర్లు, రంజీ ప్లేయర్లు పాల్గొనరాదు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే టోర్నమెంట్ లతో అస్సలు పాల్గొనరాదు. అలా ఒకవేళ పాల్గొంటే బీసీసీఐ ఆగ్రహానికి గురికాక తప్పదు. ఐపీఎల్ లోనే క్రికెటర్లకు బోలెడన్నీ డబ్బులిచ్చి తీసుకుంటారు క్రికెటర్లను. ఐపీఎల్ సెలెక్ట్ కానీ వాళ్లు మాత్రం ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ మ్యాచ్ లు ఆడేందుకు అనుమతి ఇస్తారు. అది కూడా బీసీసీఐ అనుమతితోనే ఆడొచ్చు. అలా టీం ఇండియాకు సెలెక్ట్ కానీ యుజ్వేంద్ర చాహల్, ఛటేశ్వర్ పూజరా లాంటి క్రికెటర్లు కౌంటీల్లో ఆడేవారు.
Big Bash League: సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
అయితే ఏకంగా విరాట్ కొహ్లీ బిగ్ బాష్ లీగ్ వచ్చే రెండు సీజన్లలో పాల్గొంటాడని సిడ్నీ సిక్సర్స్ చెప్పడంపై సోషల్ మీడియాలో వేరే లెవల్ చర్చ నడిచింది. అయితే తీరా చర్చ కొనసాగుతుండగా.. వెంటనే ఈ సీరియస్ చర్చకు సిడ్నీ సిక్సర్స్ టీం తెరదించింది. ఇదంటా వట్టిదేనని మీరంతా ఏప్రిల్ ఫూల్ అయ్యారని పేర్కొంది. దీంతో కాసేపు అందరూ టెన్షన్ పడ్డా.. ఏప్రిల్ ఫూల్ తో సరదాగా నవ్వుకున్నారు. సిడ్నీ సిక్సర్స్ ఉండాల్సిన టీమే అంటూ కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు (Royal Challengers Bangalore Team) ఆడుతున్న విరాట్ కొహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో బాగానే ఆడాడు. ఈ సారి బెంగళూరు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.