Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. ముంబయి రంజీ టీమ్ లో 2019 సంవత్సరం నుంచి ఆడుతున్నాడు. అయితే యశస్వి జైస్వాల్ తాను గోవాకు ఆడతానని తనకు ఎన్ వోసీ ఇవ్వాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్ కు రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు. దీంతో ముంబయి క్రికెట్ అసోసియేషన్ కూడా ఎన్వోసీ లెటర్ ను మంజూరు చేసింది.
BCCI new rule: బీసీసీఐ కొత్త రూల్ ప్రకారం..
బీసీసీఐ (BCCI) కొత్తగా తెచ్చిన రూల్ ప్రకారం.. ఇంటర్నేషనల్ టీంలో ఉన్న ఆటగాళ్లు కూడా అక్కడ మ్యాచులు లేకపోతే బీసీసీఐ నిర్వహించే డొమెస్టిక్ మ్యాచుల్లో పాల్గొనాలని పేర్కొంది. ఇదే విషయంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు విభేదించి బీసీసీఐ ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్టు పోగొట్టుకున్నారు. చాంపియన్స్ ట్రోపీలో (Champions Trophy) సెలెక్టు కానీ యశస్వి జైస్వాల్ ను కూడా రంజీ ట్రోపీలో ఆడాలని బీసీసీఐ సూచించింది. అదే విధంగా రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడిన యశస్వి రెండు ఇన్సింగ్స్ లలో కేవల 4, 26 పరుగులు చేసి ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్నాడు.
Yashasvi Jaiswal joins Goa Ranji team గోవా టీం తరఫున బరిలోకి

అయితే గోవా రంజీ టీంలోకి గతేడాది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) సిద్దేశ్ లాడ్ ఇద్దరు వలస పోయారు. ఇప్పుడు ముంబయి నుంచి యశస్వి జైశ్వాల్ కూడా గోవాకు తరలిపోతున్నాడు. అయితే ముంబయి రంజీ టీం అంటేనే దేశంలో అన్ని టీంల కంటే ఎక్కువ సార్లు రంజీ ట్రోపీ గెలుచుకుని ముందంజలో ఉంది. ముంబయి టీంకు ఆడితే చాలు టీం ఇండియాకు సెలెక్ట్ కావడం ఈజీ అనుకుంటారు. అలాంటి టీం నుంచి యశస్వి జైస్వాల్ ఎందుకు బయటకు వెళ్లి పోయాడు. కారణాలు ఏమై ఉంటాయోనని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ (Mumbai Cricket Association)లో ఏదైనా గుత్తాధిపత్యం నడుస్తుందా.. ఈ మధ్య పృథ్వీ షాపై కూడా వేటు వేశారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పృథ్వీ షాను ముంబయి జట్టు నుంచి తీసేశారు.
Yashasvi Jaiswal: ఎన్వోసీ అడగ్గానే ఇచ్చిన ముంబయి క్రికెట్ అసోసియేషన్
గోవా (Goa Cricket Association) తరఫున యశస్వి జైశ్వాల్ ను కెప్టెన్ గా నియమిస్తామని ఆ టీం మేనేజ్ మెంట్ తెలిపింది. అంతర్జాతీయ మ్యాచులు లేని సమయంలో గోవా తరఫున యశస్వి కెప్టెన్ గా వ్యవహరిస్తాడని పేర్కొంది. గోవాకు వెళ్లడం వెనక ఉన్న రీజన్ ఏంటన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎన్వోసీ అడగగానే అలా ఇచ్చేయడం.. ఇప్పటికే అర్జున్ టెండూల్కర్ గోవాకు వలస వెళ్లడంతో ముంబయి క్రికెట్ అసోసియేషన్ లో ఏదో జరుగుతుందనే భావన నెలకొంది. కానీ వీటిన్నింటికీ త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఎక్కడకు వెళ్లినా యశస్వి జైశ్వాల్ తన సత్తా చూపించగలగని చెబుతున్నారు.