Punjab Kings స‌స్పెన్స్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో విజేత‌.. పంజాబ్ కింగ్స్

Punjab Kings స‌స్పెన్స్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో విజేత‌.. పంజాబ్ కింగ్స్పంజాబ్ కింగ్స్ కు ఐపీఎల్ 2025 క‌లిసొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. పంజాబ్ సొంత స్టేడియం అయినా ముల్హానాపూర్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ ప్రేక్ష‌కుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవ‌లం 111 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. కోల్ క‌తా బౌల‌ర్ల దాటికి ఓపెన‌ర్లు మిన‌హా ఎవ‌రూ క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయారు. కానీ బౌలింగ్ లో ఆక‌ట్టుకున్న పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ పోరులో విజ‌యం సాధించి ఔరా అనిపించింది.

నిప్పులు చెరిగిన హర్షిత్ రాణా

కోల్ క‌తా బౌలింగ్ లో హ‌ర్షిత్ రాణా నిప్పులు చెరిగే బంతుల‌తో ప్రియాంశ్ ఆర్య‌ ( Priyansh Arya), అజింక్య ర‌హ‌నే, ప్ర‌భు సిమ్ర‌న్ సింగ్ (Prabhu Simran Singh)ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లు ఇలా వ‌చ్చి అలా వెనుదిరిగి పోయారు. సొంత స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచును చూసేందుకు వ‌చ్చిన పంజాబ్ అభిమానులు ఫస్ట్ ఇన్సింగ్స్ నిరాశ చెందారు. కానీ త‌ర్వాత బౌలింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఫాస్ట్ బౌల‌ర్ య‌న్ సెన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కోల్ క‌తా ఓపెన‌ర్ సునీల్ న‌రైన్ ను ఫ‌స్ట్ ఓవ‌ర్ లోనే అవుట్ చేశాడు. పంజాబ్ కు డెబ్యూ చేసిన కొత్త బౌల‌ర్ బార్గ్ లేట్ కూడా క్వింటాన్ డికాక్ వికెట్ తీసి శ‌భాష్ అనిపించుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌ఘువంశీ, అజింక్య ర‌హనె స‌మ‌యోచితంగా ఆడారు.

Punjab Kings మలుపు తిప్పిన చాహల్

అయితే వీరిద్ద‌రూ వ‌రుస ఓవ‌ర్ల‌లో అవుట్ కావ‌డంతో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. యుజ్వేంద్ర చాహాల్ నాలుగు వికెట్లు తీసి కోల్ క‌తా మిడిలార్డ‌ర్ ను క‌కావికాలం చేస్తే.. య‌న్ సెన్ (Jan Sen) మూడు వికెట్ల‌తో చెల‌రేగాడు. మ‌రో వైపు మ్యాక్స్ వెల్ కీల‌క‌మైన వెంక‌టేశ్ అయ్యర్ వికెట్ ను తీశాడు. బ్యాటింగ్ లో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న మ్యాక్స్ వెల్.. బౌలింగ్ లో మాత్రం కీల‌క‌మైన వికెట్లు తీస్తున్నాడు.

చివరకు 95 పరుగులకే కుప్పకూలిన కోల్ కతా

యుజ్వేంద్ర చాహాల్ (Yuzvendra Chahal) లాస్ట్ ఓవ‌ర్ లో మొద‌టి బంతికి ర‌స్సెల్ వికెట్ పడిపోయేదే.. అదృష్టం క‌లిసిరావ‌డంతో అదే ఓవ‌ర్ లో రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టి మ్యాచును ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాడు. అయితే ర‌స్సెల్ కు స్ట్రైక్ రాకుండా చేసిన పంజాబ్ కింగ్స్ స‌క్సెస్ అయింది. ఇటు వైపు ఉన్న బ్యాట‌ర్ వైభ‌వ్ అరోరాకు నిప్పులు చెరిగే బంతులు వేసిన అర్ష‌దీప్ సింగ్ త‌న ఓవ‌ర్ ఆరో బంతికి అవుట్ చేశాడు. దీంతో చివ‌రి వికెట్ ఉండ‌గా.. కోల్ క‌తా 95 ప‌రుగుల వ‌ద్ద ర‌స్సెల్ భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అత్య‌ల్ప స్కోరును ఛేజ్ చేయ‌లేక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ టీం చ‌తికిల‌ప‌డిపోయింది.

ఫుల్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు

చాలా రోజుల నుంచి ఫామ్ కోల్పోయి తంటాలు ప‌డుతున్న యుజ్వేంద్ర చాహ‌ల్ కోల్ క‌తాతో మ్యాచ్ లో త‌న స‌త్తా చాటాడు. ఏకంగా నాలుగు కీల‌క వికెట్లు తీసి పంజాబ్ ను గెలిపించాడు. ఐపీఎల్ లో చ‌ప్ప‌గా సాగుతున్న మ్యాచుల్లో థ్రిల్లర్ స‌స్పెన్స్ స్టోరీలాగా ప్రేక్ష‌కుల‌ను ఫుల్ జోష్ నింపేసింది. ఇటు టీవీల ముందు కూర్చున్న వారు.. అటు స్టేడియంలో ఉన్న ప్రేక్ష‌కులు ఫుల్ ఎంజాయ్ చేశారు

Leave a Comment